PV Sindhu: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి ఒక్కరు తమలో ఉన్నటువంటి టాలెంట్ సోషల్ మీడియా వేదికగా బయట పెడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది ట్రెండ్ అవుతున్నటువంటి పాటలకు రీల్స్ చేస్తూ తమలో ఉన్న టాలెంట్ బయట పెడుతున్నారు ఇలా సోషల్ మీడియా ద్వారా మరికొందరు సెలబ్రిటీలుగా మారిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఇండియన్ ఏస్ షట్లర్ పీవీ సింధు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈమె ఏస్ షట్లర్ గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియాలో ఏకంగా 35 లక్షలకు పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నారు. ఇలా క్రీడారంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పీవీ సింధు సినిమాలపై కూడా ఎంతో ఆసక్తి ఉందని మనకు అర్థమవుతుంది.ఈమె క్రీడారంగంలో దూసుకు వెళ్తున్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ట్రెండ్ అవుతున్న పాటలకు డాన్స్ వీడియోలు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.
PV Sindhu: డాన్స్ వీడియోతో రెచ్చిపోయిన సింధు…
ఇలా ఇప్పటికే ఎన్నో డాన్స్ వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసినటువంటి పీవీ సింధు తాజాగా చీరకట్టులో అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఇలా చీరకట్టులో ఈమె అద్భుతమైన పర్ఫామెన్స్ చేయడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం పీవీ సింధు డాన్స్ వీడియో పై మీరు ఓ లుక్ వేసేయండి.