Raana: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లీడర్ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రానా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే అందరి హీరోల లాగా కేవలం హీరోగా మాత్రమే కాకుండా కంటెంట్ ఉన్న కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. విరాటపర్వం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రానా ప్రస్తుతం వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
ఇదిలా ఉండగా తాజాగా వెంకటేష్ కూతురు అశ్రితతో కలిసి రానా పిజ్జా చేస్తూ సందడి చేస్తాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత ఒక ఫుడ్ బ్లాగర్. ఇన్ఫినిటీ ప్లేటర్ పేరుతో బేకరీ ఫుడ్స్ బిజినెస్ నిర్వహిస్తోంది. ఇదే పేరుతో ఆమె సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది. ఈ మేరకు గతంలో తన బావ నాగచైతన్యతో కలిసి వివిధ రకాల వంటలు చేసి ఆకట్టుకుంది. తాజాగా తన అన్నయ్య రానాతో కలిసి పిజ్జాలు రెడీ చేసింది.
Raana: అన్నయ్యను ఆటపట్టించిన ఆశ్రిత..
దగ్గుబాటి రామానాయుడు నివాసం ఉన్న ఆ పాత ఇంటిని శాంక్చువరీ పేరుతో ఓ రెస్టారెంట్ గా మార్చి రానా స్నేహితుడు దానిని నిర్వహిస్తున్నాడు. అయితే చాలా కాలం తర్వాత రానా తన చెల్లితో కలిసి అక్కడికి వెళ్లి వారి చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ఇక ఈ వీడియోలో ఆశ్రిత తన అన్న రానాకి పిజ్జా చేయటం నేర్పించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. ఆ తర్వాత రానా , ఆశ్రితతో పాటు రానా భార్య మిహిక, అలాగే రానా స్నేహితుడు కూడా పిజ్జా తింటూ కబుర్లు చెప్పుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.