Raccha Ravi: బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి కామెడీ షో లలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రచ్చ రవి ఒకరు.ఈయన ఈ కార్యక్రమం మొదట్లో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందారు. అయితే తన పర్ఫామెన్స్ ద్వారా అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారినటువంటి రచ్చ రవి తన అద్భుతమైన స్కిట్లతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.
ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రచ్చ రవి ఉన్నఫలంగా ఈ కార్యక్రమానికి దూరమయ్యారు. ఇలా రచ్చ రవి బయటకు రావడంతో అందరిలాగే ఈయనకి కూడా మల్లెమాల వారితో మనస్పర్ధలు వచ్చాయని భావించారు. ఇలా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన రచ్చ రవి ఎక్కడా కూడా తాను జబర్దస్త్ వీడడానికి గల కారణాలను మాత్రం తెలియజేయలేదు. ఇలా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
Raccha Ravi: సినిమా అవకాశాలు రావడమే కారణం…
ఇలా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రచ్చ రవి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రచ్చ రవి జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి రావడానికి గల కారణాలను తెలిపారు. అందరూ అనుకున్నట్టు తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి రావడానికి మల్లెమాల వారితో గొడవలు కారణం కాదని తెలిపారు. జబర్దస్త్ కార్యక్రమం తనుకు ఒక తల్లి లాంటిదని ఈయన తెలియజేశారు. అయితే జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలోనే తనకు సినిమా అవకాశాలు వచ్చాయి ఇలా జబర్దస్త్ లో కొనసాగుతూ సినిమాలు చేయడం అంటే కుదరని పక్షంలో తాను జబర్దస్త్ కార్యక్రమం నుంచి విడిపోవలసి వచ్చిందని అంతకుమించి మరే కారణాలు లేవు అంటూ ఈ సందర్భంగా రచ్చ రవి జబర్దస్త్ వీడటానికి కారణాలను తెలియజేస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.