Raccha Ravi: జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు పొందిన రచ్చ రవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చమ్మక్ చంద్ర టీమ్ లో ఎన్నో స్కిట్స్ లో చేసి తన కామెడీ పంచ్ లతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుని కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ‘ తీసుకోలేదా రెండు లచ్చల కట్నం ‘ అనే డైలాగ్ రచ్చ రవి జీవితాన్ని మార్చేసింది. ఇప్పటికీ ఆ డైలాగ్ చాలా ఫేమస్. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా గుర్తింపు పొందిన రచ్చ రవి సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకున్నాడు. ఎన్నో సినిమాలలో కామెడియన్ గా , క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించి నటుడిగా కూడా గుర్తింపు పొందాడు.
ఇదిలా ఉండగా ఇటీవల విడుదలైన ‘ బలగం ‘ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నటించిన రచ్చ రవి సినిమా మొత్తం ‘ ఆగుతవ రెండు నిమిషాలు అనే ‘ ఒకే ఒక్క డైలాగ్ చెబుతూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అప్పుడు జబర్దస్త్ లో చెప్పిన డైలాగ్, ఇప్పుడు బలగం సినిమాలోని డైలాగ్ తన జీవితాన్ని మార్చేసిందంటూ రచ్చ రవి ఎమోషనల్ అయ్యాడు. దీనికి కారణమైన చమ్మక్ చంద్ర, వేణులకు కృతజ్ఞతలు చెబుతూ ఎమోషనల్ పోస్ట్ వేశాడు.
Raccha Ravi: నా జీవితాన్నే మార్చేశాయి…
తాజాగా రచ్చ రవి షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్టులో రచ్చ రవి ఎమోషనల్ అవుతూ.. ” ఏమి ఇవ్వగలను మీకు.. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం 2013 మార్చ్ నెలలో ‘తీసుకోలేదా రెండు లక్షల కట్నం’..మళ్లీ పది సంవత్సరాల తర్వాత 2023 మార్చి నెలలో రిలీజ్ అయిన “బలగం” సినిమాలో “ఆగుతావా రెండు నిమిషాలు”.. అనే డైలాగులు నా జీవితాన్నే మార్చేశాయి. ఈ రెండు డైలాగులు ఫేమస్ అయిన తర్వాత ఎంతోమంది పర్సనల్ గా నా నంబర్ తీసుకొని మరి నన్ను ప్రశంసించారు. నా జీవితానికి గుర్తింపు ఇచ్చిన ఈ రెండు డైలాగులు ఇచ్చిన మీకు ఏమి ఇవ్వగలను రుణపడి ఉండడం తప్ప. నా బలం…నా బలగం… అన్నీ మీరే” అంటూ రాసుకోచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది.