Racha Ravi: జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. అలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో రచ్చ రవి కూడా ఒకరు. జబర్దస్త్ స్టేజ్ మీద తీసుకోలేదా రెండు లక్షలు కట్నం అంటూ అందరిని తన కామెడీ పంచలతో డైలాగులతో ఆకట్టుకున్న రచ్చ రవి ఇండస్ట్రీలో కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు. జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తింపుతో సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకున్నాడు. ప్రస్తుతం కామెడీ షోలలో స్కిట్లు చేయడమే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రచ్చ రవి తన చెల్లెల్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
సాధారణంగా కుటుంబ సభ్యులలో ఒకరు దూరమైన కూడా ఆ బాధ వర్ణించలేము. రచ్చ రవి కూడా తన చెల్లెల్ని దూరం చేసుకుని ఇప్పటికీ బాధపడుతున్నాడు. నటన మీద తనకి ఉన్న ఆసక్తి వల్ల కుటుంబ సభ్యులను వదిలి సినిమా అవకాశాల కోసం వచ్చిన రచ్చ రవికి తన చెల్లెలు ఎంతో సహాయం చేసింది. నా చెల్లెలు ఇచ్చిన రూ. 123 రూపాయలతో ఇంటిని విడిచి సినిమా అవకాశాల కోసం పట్నం వచ్చిన నేను ఈరోజు ఇంత సంపాదించినా కూడా నా చెల్లెలు నా ఇంటికి రావడం లేదు అంటూ రచ్చ రవి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఇంటర్వ్యూలో రచ్చ రవి మాట్లాడుతూ..”ప్రతీ రాఖీ పండక్కి నేను నా చెల్లి దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టించుకుంటాను.
Racha Ravi: చెల్లి లేని లోటు అలాగే ఉంది…
అయితే కొన్ని సంవత్సరాలుగా నా చెల్లెలు నాతో మాట్లాడటం లేదు, మా ఇంటికి రావడం లేదు. 2016లో నా ఇంటి గృహప్రవేశానికి వచ్చిన తర్వాత నుంచి ఇక నా ఇంటి గుమ్మం తొక్కలేదు. ఈ రోజు నేను ఇంత సంపాదించుకున్నాను అంటే దానికి కారణం మా చెల్లి రజితనే. నావల్ల ఏదైనా తప్పు జరిగితే చెప్పాలి కానీ ఇలా ఇంటికి రాకుండా ఉండటం ఏంటి అని ఎమోషనల్ అయ్యాడు. నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ నా చెల్లెలు నా ఇంటికి రాకపోవడమే నాకు అతి పెద్ద లోటు అంటూ చెప్పాడు. అయితే నా చెల్లెలు నా మీద ఎందుకు అలిగిందో తెలీదు.. అయ్యిందేదో అయ్యింది ఇప్పటికైనా నా ఇంటికి రా చెల్లెమ్మ అంటూ రవి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.