Radhika : తెలుగులో రక్త చరిత్ర అనే చిత్రం ద్వారా సినిమా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యుటి రాధికా ఆప్టే గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఆఫర్ల విషయంలో కొంత మేర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పట్టు విడవకుండా శ్రమించి బాగానే నిలదొక్కుకుంది. దీంతో ఇక్కడ మాత్రమే కాదు హాలీవుడ్ లో కూడా సినిమాలు చేసే రేంజ్ కి వెళ్ళిపోయింది.
అయితే నటి రాధికా ఆప్టే బాలీవుడ్, హాలీవుడ్ కి వెళ్ళిపోయిన తర్వాత టాలీవుడ్ ని బొత్తిగా పట్టించుకోవడం మానేసింది. దీంతో ఈ అమ్మడిని టాలీవుడ్ ఫ్యాన్స్ బాగా మిస్ అవుతున్నారు. ఈ విష్యం ఇలా ఉండగా ఈ మధ్య నటి రాధికా ఆప్టే ఎక్కువగా తానూ నటించిన చిత్రాలతో కంటే వివాదాలతోనే బాగా పాపులర్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ మధ్య రాధికా ఆప్టే ఏకంగా సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు రావాలంటే మంచి ఫిజిక్ ఉండాలని లేకపోతే హీరోయిన్లకి ఆఫర్లు రావని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడి వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా నటి రాధికా ఆప్టే తన అధికారిక సోషల్ మీడియా లో షేర్ చేసిన కొన్ని ఫోటోల కారణంగా మరోసారి వైరల్ అవుతోంది.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఈ మధ్య నటి రాధికా ఆప్టే సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలో తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వంటివి అప్పుడప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. కాగా తాజాగా ఈ అమ్మడు ఏకంగా బార్ లో బీర్ తాగుతున్న ఫోటో ని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అయితే ఈ ఫొటోలో బీర్ టవర్ లో నుంచీ కొళాయి తిప్పి బీర్ తాగుతూ కనిపించింది.
దీంతో ఈ ఫోటోని నెటిజన్లు బాగానే ట్రోల్ చేస్తున్నారు. అలాగే మద్యపానం హానికరం అని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ఇలాంటి నటీనటులు మాత్రం మద్యపానం సేవిస్తున్న ఫోటోలు షేర్ చేస్తూ పరోక్షముగా మద్యం ని ఎంకరేజ్ చేస్తున్నారని మండి పడుతున్నారు. అలాగే వెంటనే ఈ ఫోటోని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ రాధికా ఆప్టే మాత్రం ఈ కామెంట్లని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అయితే ఇలాంటి కాంట్రవర్సీలు రాధికా ఆప్టే కి కొత్తేమి కాదు. కాగా గతంలో కూడా పలు అర్ధనగ్న ఫోటో షూట్ లో పాల్గొనడం వలన కేసులో ఇరుక్కుంది. అయినప్పటికీ నటి రాధికా ఆప్టే తీరు మాత్రం అస్సలు మారలేదు.
ఈ విషయం ఇలా ఉండగా ఈ అమ్మడు హిందీలో మోనికా ఓ మై డార్లింగ్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కాగా ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటిటి అయిన నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.