Raghava Lawrence: కోలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు కొరియోగ్రాఫర్ అయిన రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాఘవ లారెన్స్ మొదట కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత దర్శకుడిగా, హీరోగా కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. రాఘవ హీరోగా నటించిన కాంచన వంటి హర్రర్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమా సీక్వెల్ లో రాఘవ నటిస్తున్నాడు.
ఇదిలా ఉండగా రాఘవ లారెన్స్ మరొకసారి తన మంచి మనసు చాటుకున్నాడు. లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎంతోమందికి చిన్నారులకు సేవ చేస్తూన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనాధలైన చిన్నారులను ఆదరించి సొంత డబ్బులతో వారి బాగోగులు చూసుకుంటూ తన మంచి మనసు చాటుకున్నాడు. ఇక తాజాగా మరో 150 మంది చిన్నారులను ఆయన దత్తత తీసుకున్నారు. తాజాగా ఈ విషయాన్ని లారెన్స్ అభిమానులతో పంచుకున్నాడు. పిల్లలతో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
Raghava Lawrence: పిల్లలకు మీ ఆశీస్సులు కావాలి…
తాజాగా లారెన్స్ నటిస్తున్న ” రుద్రన్” సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ లో ఈ విషయాన్ని తెలిపాడు. అంతే కాకుండా పిల్లలకు అభిమానుల ఆశీర్వాదాలు కావాలని కోరాడు. తెలుగు రాష్ట్రాలలో ఎవరైనా చిన్నారులు ఆర్థిక సమస్యల వల్ల చదువుకు దూరమైనా లేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా కూడా వెంటనే లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ని సంప్రదించాలని కోరాడు. ఇక రాఘవేంద్ర స్వామి వారి ఆశీస్సులతోనే తాను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నానని తెరపై మాత్రమే కాదు తెర వెనక కూడా రియల్ హీరో అనిపించుకోవాలని తరచూ తన తల్లి తనకు చెబుతూ ఉండేదని ఈ సందర్భంగా తల్లి మాటలను లారెన్స్ గుర్తు చేసుకున్నారు. ఇక లారెన్స్ చేసిన ఈ మంచి పని గుర్తించిన అభిమానులు ఆయన మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం లారెన్స్ పిల్లలతో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.