Rajamouli: రాజమౌళి పరిచయం అవసరం లేని పేరు. ఒక సీరియల్ డైరెక్టర్ గా తన ప్రయాణం మొదలుపెట్టిన రాజమౌళి ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన రాజమౌళి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇండస్ట్రీలో అపజయమెరుగని దర్శకుడిగా గుర్తింపు పొందిన ఈయన తాజాగా తన సినిమాకు ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నారు.
ఇలా రాజమౌళి సినిమాలు ఈ స్థాయిలో సక్సెస్ అవుతాయి అంటే అందుకు గల కారణం తన సినిమాల విషయంలో తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది. రాజమౌళి కుటుంబ సభ్యులందరూ కలిసి సినిమాకు పని చేస్తారు. ఇలా సినిమాల విషయంలో ఆయనకు తన కుటుంబ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పాలి. ఇకపోతే రాజమౌళి భార్య రమా గురించి గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. రాజమౌళి రమా గారికి మొదటి భర్త కాదు ఆయన తనకు రెండవ భర్త. ఈమె మొదట వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒక కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత తనతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడిపోయారు.
Rajamouli: పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి…
ఇలా భర్త నుంచి విడిపోయిన రమ రాజమౌళికి శాంతినివాసం సీరియల్ కి డైరెక్షన్ చేసే సమయంలో పరిచయమయ్యారు.అయితే వీరి పరిచయం ప్రేమగా మారడంతో చివరికి తనకు కొడుకు ఉన్నారని తెలిసిన కూడా రాజమౌళి పెళ్లి చేసుకున్నారు.అయితే రమ మొదటి భర్త ఎవరు ఏంటి అని ఆరా తీసిన ఆ విషయాలు మాత్రం బయటికి రాలేదు కానీ రమాకు పెళ్లి చేసింది మాత్రం కీరవాణి అని తెలుస్తుంది. రమ స్వయంగా కీరవాణి భార్య వల్లి సోదరి.ఈ క్రమంలోనే కీరవాణి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కు రమాను ఇచ్చి వివాహం చేశారట. అయితే వివాహం తర్వాత ఆ వ్యక్తి నిజస్వరూపం బయటపడటంతో ఈమె దూరంగా ఉన్నారని ఈ విషయంలో కీరవాణి కూడా ఎంతో పశ్చాత్తాప పడ్డారని తెలుస్తోంది.