Rajamouli -Prashanth Neel:దక్షిణాది సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందినటువంటి వారిలో దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందడమే కాకుండా త్రిబుల్ ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకున్నటువంటి ఘనత కేవలం రాజమౌళికి మాత్రమే దక్కిందని చెప్పాలి.ఇలా ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే ఒక ఫేవరెట్ హీరో ఉన్నారని తెలుస్తోంది.
ఇక కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి కేజిఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈయన కే జి ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఈయన టాలీవుడ్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతోమందిఆదరణ సంపాదించుకున్నటువంటి ఈ ఇద్దరు డైరెక్టర్లకు ఒకే ఒక తెలుపు హీరో అంటే ఇష్టం అని తెలుస్తుంది మరి ఆ తెలుగు హీరో ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే…
Rajamouli -Prashanth Neel: ఎన్టీఆర్ అంటే అంత ఇష్టమా..
ఇద్దరు పాన్ ఇండియా డైరెక్టర్లకు ఇష్టమైనటువంటి టాలీవుడ్ హీరో మరెవరో కాదు ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రశాంత్ ఎన్టీఆర్ ఇద్దరి మధ్య చాలా మంచి స్నేహబంధం ఉంది త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కూడా రాబోతుంది. ఇక ఎన్టీఆర్ జక్కన్న కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు ఎన్టీఆర్ తోనే రాజమౌళి మొట్టమొదటి సినిమాను చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రాజమౌళి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ను ఒక హీరో కాకుండా తమ సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తారు. అంతగా వీరిద్దరి మధ్య చనువు ఉంది. దీంతో ఎన్టీఆర్ ఈ ఇద్దరు డైరెక్టర్లకు ఫేవరెట్ అయ్యారు.