Rajamouli Remuneration: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతాయనే విషయం మనకు తెలిసిందే.ఇక ఈయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను కూడా అందుకు ఉంటాయి. ఈ క్రమంలోనే రాజమౌళి సినిమా వస్తుందంటే సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన RRR సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ఈనెల 25వ తేదీ విడుదలకు సిద్ధమైంది.
ఇలా విడుదల తేది దగ్గర పడటంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రాజమౌళి ఈ సినిమా మొత్తం కలిపి 500 కోట్ల బడ్జెట్ అయ్యిందనీ వెల్లడించారు. అయితే ఈ బడ్జెట్ లో రాజమౌళికి ఏమాత్రం రెమ్యూనరేషన్ లేదు కేవలం నటీనటులు టెక్నీషియన్లు, ఇతర ఖర్చులు అన్నీ కలిపి ఐదు వందల కోట్లు అయినట్లు వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందే పెద్దఎత్తున బిజినెస్ చేసినట్లు సమాచారం.

Rajamouli Remuneration: ఏ డైరెక్టర్ తీసుకోనీ రెమ్యూనరేషన్…
ఇక ఈ సినిమా కోసం రాజమౌళి ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదనే సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాకి వచ్చే లాభాలలో 30 శాతం వాటా తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమా 200 కోట్ల బిజినెస్ చేస్తే ఇందులో 500 కోట్లు పెట్టుబడి పోను మిగిలిన 1500 కోట్లలో 30 శాతం వాటా అంటే రాజమౌళికి సుమారు 450 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ వస్తుంది.ఇలా ఒక్క సినిమాకి 450 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలియడంతో ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మన ఇండియాలోనే ఏ డైరెక్టర్ కూడా తీసుకొని పారితోషకం రాజమౌళి తీసుకోవడంతో ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ సినిమా 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతోఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ విధమైనటువంటి రికార్డులను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది.