Rajamouli:తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఎస్ ఎస్ రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే.కెరియర్ మొదట్లో శాంతినివాసం అనే సీరియల్ కి దర్శకుడుగా వ్యవహరిస్తున్నటువంటి రాజమౌళి అనంతరం స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రాజమౌళి అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకొని ప్రతి ఒక్క సినిమాని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించారు. ఇలా అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నారు.
ఇకపోతే రాజమౌళి సినిమాలపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ వచ్చారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని తెలుగు సినిమా సత్తా ఏంటో ఆల్ ఇండియాకి తెలియజేశారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా తెలుగు సినిమా సత్తాని అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసి ఎంతో మంచి గుర్తింపు పొందారు.
Rajamouli పది రోజులకే తన సత్తా తెలిసిపోయింది…
ఇక రాజమౌళి దర్శకత్వంలో వహించిన సినిమాలలో ఎక్కువగా ఎన్టీఆర్ తో సినిమాలు చేశారని చెప్పాలి ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దాదాపు నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ క్రమంలోని వీరిద్దరి మధ్య ఎంతో మంచి చనువు ఉంది. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా సమయంలో ఎన్టీఆర్ గురించి రాజమౌళి ఫీలింగ్ ఏంటి అనే విషయాన్ని ఓ సందర్భంలో తెలియచేశారు.మొదటి సినిమాకు ఎంతో ఎక్సైట్ గా షూటింగ్ లోకేషన్ లోకి అడుగుపెడితే అక్కడ ఎన్టీఆర్ ని చూసి ఒక్కసారిగా తనకు నీరుత్సాహం కలిగిందని ఓరి దేవుడా వీడేంట్రా నాకు తగులుకున్నాడు అని భావించానని గతంలో రాజమౌళి తెలిపారు. ఇలా రాజమౌళి ఎన్టీఆర్ ను కుంటి గుర్రంతో పోలుస్తూ తనని ట్రీట్ చేశారని అయితే షూటింగ్ మొదలైన పది రోజులకే తనలో సత్తా ఏంటో తెలిసిపోయింది అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి రాజమౌళి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.