Rajasekhar: మరోసారి మెగా ఫ్యామిలీకి హీరో రాజశేఖర్‌కు మధ్య రచ్చ మొదలైంది. గతంలో మెగాస్టార్‌పై జీవిత రాజశేఖర్ దంపతులు పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మధ్యలో ఈ వివాదం సద్ధుమణిగింది. మళ్ళీ ఇటీవల విమర్శలు మొదలయ్యాయి. తాజాగా రాజశేఖర్ హీరోగా నటించిన శేఖర్ సినిమా రిలీజైనట్టే అయి ఆగిపోయింది. నిర్మాత కోర్టులో కేసు వేయడం వల్ల కోర్టు ఆదేశాల మేరకు ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. ఇప్పటికే, ఈ సినిమా విషయంలో రక రకాల చర్చలు, వివాదాలు రేగిన సంగతి తెలిసిందే.
అయితే, ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలను మీడియా ఇంటర్వ్యూలో హీరో రాజశేఖర్ పంచుకున్నారు. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి, గబ్బర్ సింగ్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇప్పటికే, చాలాసార్లు హీరోయిన్లతో.. నాతో సినిమా చేయొద్దనంటూ చెప్పారని అన్న ఆయన, దర్శకులకు రాజశేఖర్‌తో సినిమాలు చేయవద్దని చెప్పినట్టు తెలిపారు. ఇక ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో రాజశేఖర్ చిరంజీవిపై ఉన్న అభిప్రాయాన్ని చెప్పినట్టు తెలిపారు. ఇది పవన్ కళ్యాణ్‌కు నచ్చలేదు. అందుకే, నాపై కోపంతో గబ్బర్ సింగ్ సినిమాలో సీన్ పెట్టినట్టు చెప్పుకొచ్చారు.
Rajasekhar: వార్నింగ్ ఇచ్చినట్టే చేశారు.
గబ్బర్ సింగ్ సినిమా చూశానని రాజశేఖర్ అన్నారు. దీనిలో గబ్బర్ సింగ్ బ్యాచ్ చేసిన కామెడీ సీన్ గురించి వివరించారు. సినిమా అంతా ఒకేగానీ, ఏమి సేస్తిరి సేస్తిరి అనేది మాత్రం తనకు వార్నింగ్ ఇచ్చినట్టే చేశారని అన్నారు. నా మీద కోపంతోనే పవన్ కళ్యాణ్ అలా చేశారని తెలిపారు. మరి దీనిపై మళ్ళీ మెగా ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కాగా, జీవితరాజశేఖర్ శేఖర్ సినిమా వివాదాన్ని పరిష్కరించుకేందుకు తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. చూడాలి మరి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ సమస్యలన్నీ సమసిపోయి మళ్ళీ విడుదలవుతుందా లేదా.