Rajeev Kanakala: రాజీవ్ కనకాల తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ఈయన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి రాజీవ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు .ముఖ్యంగా సుమతో తనకు విడాకులు అంటూ వస్తున్నటువంటి వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్ తో ఈయనకు గొడవలు ఉన్నాయంటూ వస్తున్నటువంటి వార్తలపై కూడా స్పందించారు.
ఎన్టీఆర్ రాజీవ్ కనకాల ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు ఎన్టీఆర్ ఏ సినిమాలో అయినా నటిస్తున్నారు అంటే ఆ సినిమాలో తప్పకుండా రాజీవ్ కోసం కూడా ఒక పాత్ర రాసేవారు అంతలా వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉండేది అయితే ఈ మధ్యకాలంలో వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కాస్త తగ్గిందని తెలుస్తుంది.దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అందుకే ఎన్టీఆర్ రాజీవ్ దూరంగా ఉంటున్నారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై కూడా ఈ సందర్భంగా రాజీవ్ స్పందించారు.

Rajeev Kanakala: ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు…
ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో గ్లోబల్ స్టార్ గా మారిపోయి ఎంతో బిజీగా ఉన్నారు. నేను కూడా కొన్ని బాధ్యతలు కారణంగా ఎన్టీఆర్ ని కలవలేక పోతున్నాను అందుకే మా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు మా ఇద్దరి మధ్య స్నేహం అలాగే కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం నాకు ఉన్నటువంటి కొన్ని బాధ్యతలు కారణంగా ఎన్టీఆర్ ని కలవలేక పోతున్నాను.తాజాగా తారక్ నాకు ఫోన్ చేసి దేవర సినిమా షూటింగ్ చూడటానికి రమ్మని కూడా పిలిచారు. కానీ కుదరలేదు త్వరలోనే వెళ్లాలి అంటూ ఈ సందర్భంగా తమ మధ్య ఎలాంటి గొడవ లేదని రాజీవ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.