RajiniKant: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ గురించి మనకు తెలిసిందే. దర్శకురాలిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఐశ్వర్య రజనీకాంత్ ప్రస్తుతం తన భర్త నటుడు ధనుష్ తో విడిపోయి ఒంటరిగా పిల్లలతో గడుపుతున్నారు. ఇలా ఒంటరిగా ఉన్నటువంటి ఈమె తిరిగి మెగా ఫోన్ పడుతూ ఇండస్ట్రీలో బిజీగా మారనున్నారు.అయితే తాజాగా ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగలు పడ్డారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే దొంగలు ఇంట్లో లాకర్ లో ఉన్నటువంటి విలువైన బంగారు వజ్రాల ఆభరణాలను దొంగలించినట్లు సమాచారం. ఇలా ఈమె ఇంట్లో దొంగలు పడటంతో ఈమె చెన్నై తేనాంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
నటుడు ధనుష్ నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్నటువంటి ఐశ్వర్య ఇంట్లో దొంగలు పడ్డారు. ఈమె ఇంట్లో ఉన్న లాకర్ లో ఉన్న వజ్రాలు, అరమ్ నెక్లెస్ తో పాటు 60 సవరీల గాజులు కనిపించకుండా పోయాయని చెన్నై తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నగలు లక్షల విలువ చేస్తాయని సమాచారం. తన ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులే ఎత్తుకెళ్లి ఉంటారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. 2019లో తన చెల్లెలు సౌందర్య పెళ్లికి ఆ నగలను ఉపయోగించిన తర్వాత ఆమె ఆ నగలను తన లాకర్ లో పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే దొంగలు ఆ నగలను దొంగలించినట్లు ఐశ్వర్య పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
RajiniKant: పని వాళ్లపై ఫిర్యాదు చేసిన ఐశ్వర్య…
దొంగలు దొంగతనం చేసిన ఆ నగలు 2021 ఆగస్టు వరకు ఆ లాకర్ సేయింట్ మేరీస్ రోడ్డు లోని తన అపార్ట్ మెంట్ లో ఉంచానని.. హీరో ధనుష్ తో కలిసి ఉన్నసమయంలో అవి అక్కడే ఉన్నాయని అయితే విడాకుల తర్వాత తన తండ్రి ఉన్నటువంటి పోయిస్ గార్డెన్ లోకి షిఫ్ట్ చేశానని తెలిపారు. లాకర్ కి సంబంధించిన తాళాలు అపార్ట్మెంట్లోనే ఉంటాయని అయితే ఈ తాళాల గురించి ఇంట్లో పని చేసే ముగ్గురు పని మనుషులకు తెలుసు అంటూ ఈమె ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు పనిచేసే ముగ్గురు వ్యక్తులను విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఇక సినిమాల విషయానికొస్తే ఐశ్వర్య లాత్ సలామ్’ అనే మూవీకి దర్శకత్వం వహిస్తుంది.. ఇందులో రజినీకాంత్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.