Rakesh -Sujatha: తెలంగాణలో బోనాల జాతర ఎంత ఘనంగా జరుపుకుంటారో అందరికీ తెలిసిందే. తెలంగాణలో మాత్రమే కాకుండా విదేశాలలో ఉంటున్న తెలంగాణ ప్రజలు కూడా ఈ బోనాల జాతరను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో తాజాగా లండన్ లో ఉన్న తెలంగాణ వాసులందరూ కూడా బోనాల జాతర ఘనంగా జరుపుకున్నారు. ఈ జాతరలో జబర్దస్త్ జంట రాకింగ్ రాకేష్ – జోర్దార్ సుజాత సందడి చేయడం విశేషం. రాకేష్ సుజాత ఇటీవల పెద్దల సమక్షంలో వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. వివాహం తర్వాత వీరిద్దరూ వరుసగా విదేశాలలో వెకేషన్లు ఎంజాయ్ చేస్తున్నారు.
వీరిద్దరూ కూడా లండన్ లో సందడి చేశారు. లండన్ లోని వరంగల్ కు చెందిన ఎన్ఆర్ఐ ఫోరం గత పదేళ్లుగా అక్కడ బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. ఇక ఈ ఉత్సవాలలో యాంకర్ గా తెలంగాణ బిడ్డ అయిన జోర్దార్ సుజాతను ఆహ్వానించారు. దీంతో సుజాత రాకేష్ దంపతులు లండన్ లో జరిగిన బోనాల ఉత్సవాలలో సందడి చేశారు. అంతేకాకుండా వీరిద్దరూ కూడా లండన్ లోని పలు ప్రదేశాలలో తిరుగుతూ ఎంజాయ్ చేశారు.
Rakesh -Sujatha: బోనమెత్తిన సుజాత…
ప్రస్తుతం వీరి లండన్ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం వీరిద్దరూ అటు పర్సనల్ ట్రిప్స్ .. ఇటు ప్రోఫిషినల్ ట్రిప్స్ అన్నీ కలిసోచ్చేలా ప్లాన్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ బోనాల జాతర గురించి రాకింగ్ రాకేశ్ స్పందిస్తూ.. ‘‘వరంగల్ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఈసారి బోనాల వేడుకలో మేం భాగం కావాలని వరంగల్ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ కోరంగా.. గతంలో వారు చేసినా సేవలకు కృతజ్ఞతా భావంతో లండన్ షో చేశాం ” అని చెబుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు.