Rakhi Sawant: బాలీవుడ్ నటి రాఖీ సావంత్ బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా పరిచయం. ఈమె నటిగానే కాకుండా డాన్సర్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది. అంతేకాకుండా హిందీ బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నది. చివరి వరకు పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది. తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో తెగ పంచుకుంటుంది.
ఇక ఆమె ఎన్నో స్పెషల్ సాంగ్ లలో హాట్ లుక్ లో కనిపించగా.. ఆమెకు ఐటమ్ గర్ల్, ఐటెం బాంబ్ అనే పేరు కూడా పెట్టారు. ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె గతంలో బ్రిటన్ కు చెందిన రితేష్ అనే ఒక వ్యాపార వేత్తను రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఇక ఏం జరిగిందో తెలియదు కానీ అంతలోనే అతనితో విడిపోయిన మరో బిజినెస్ మాన్ తో లవ్ లో పడింది.
అంతేకాకుండా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్లు తెలిసింది. ఇక అతడి పేరు అదిల్ దురానీ. అతడు మైసూర్ కి చెందిన బిజినెస్ మాన్. ఇక అదిల్ ఆమె కంటే ఆరేళ్ల చిన్నవాడు. అయితే అతడిని ఆమె సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు పూలదండలు మార్చుకొని తమ మ్యారేజ్ సర్టిఫికెట్లు చూపిస్తున్నట్లు కనిపించింది.
Rakhi Sawant:
అయితే ఈ పెళ్లి గత ఏడాది జరిగినట్లు తెలియగా ఇంతకాలం ఈ పెళ్లి విషయం ఎందుకు బయట పెట్టలేదు అని అనుమానాలు వస్తున్నాయి. గతంలో వీరి ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఆ సమయంలో అదిల్ ప్రేయసిని అంటూ ఒక అమ్మాయి రాఖీ సావంత్ కి ఫోన్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదిల్ ఆ అమ్మాయిని రాఖీ సావంత్ కంటే ముందే ప్రేమించి బ్రేకప్ చెప్పుకున్నాడు. ఈ విషయాన్ని రాఖీ సావంత్ గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా బయటపెట్టింది.