Rakul Preeth Singh: అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రకుల్ మొదటి సినిమా తోని మంచి హిట్ అందుకుంది. ఆ సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రకుల్ టాలీవుడ్లో స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలు దక్కించుకుంది. అలాగే తమిళ భాషలో కూడా ఎందరో స్టార్ హీరోలతో నటించి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. అయితే కొంతకాలం క్రితం బాలీవుడ్లో అవకాశాల కోసం రకుల్ టాలీవుడ్ కి దూరం అయింది.
కొంతకాలం బాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు అందుకున్న రకుల్ ప్రస్తుతం ఆడపాదప సినిమాలలో మాత్రమే నటిస్తోంది. అయితే అటు నార్త్ ఇటు సౌత్ లో కూడా చాలా కాలంగా ఈ అమ్మడికి సరైన హిట్లు లేవు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తనకు అవకాశాలు తగ్గటానికి గల కారణాల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒక సీనియర్ హీరో వల్లే తనకు టాలీవుడ్లో అవకాశాలు తగ్గాయని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ మాట్లాడుతూ..” టాలీవుడ్ నన్ను స్టార్ ని చేసింది. నాకు సౌత్ లో అద్భుతంగా ఆఫర్స్ వచ్చేవి అంటూ చెప్పుకొచ్చింది.
Rakul Preeth Singhనాగార్జున వల్లే అవకాశాలు తగ్గిపోయాయి…
అంతే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఒక సీనియర్ హీరోతో నటించిన చిత్రంలో ముద్దు సీన్లు ఆడియన్స్ కి నచ్చలేదు. అందువల్ల ఆ చిత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇక అప్పటినుండి సౌత్ లో నాకు ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి అంటూ” రకుల్ కామెంట్స్ చేసింది. అయితే రకుల్ చెప్పిన ఆ సీనియర్ హీరో నాగార్జున అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మన్మధుడు 2 సినిమాలో రకుల్ నాగార్జునతో జత కట్టింది. ఆ సినిమాలో ఇద్దరి మధ్య ముద్దు సన్నివేశాలు కూడా ఉన్నాయి. అందువల్ల నాగార్జున వల్లే తనకు అవకాశాలు తగ్గిపోయాయని అర్ధం వచ్చేలా రకుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.