Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ అంటే తెలియని వారంటూ ఉండరు. తెలుగు సినీ పరిశ్రమలో ఈమెకు మంచి పేరు ఉంది. కెరటం సినిమా ద్వారా ఈమె తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను ఆమెకు మంచి పేరు వచ్చింది. అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోలందరి సరసన నటించింది.
లౌక్యం, నాన్నకు ప్రేమతో ధృవ లాంటి హిట్ సినిమాల్లో ఆమె నటించింది. ఇక ఆమె బాలీవుడ్ లో కూడా ఒక సినిమాలో నటించింది. అయితే తెలుగులోనే ఎక్కువగా అవకాశాలు రావడంతో తెలుగులో సినిమాలు చేయాలని తెలుగు ఇండస్ట్రీలో ఉండిపోయింది. కానీ ఎందుకో తెలియదు కానీ ఆమెకు తెలుగులో సినిమా అవకాశాలే రాలేకపోయాయి.
అందుకే ఆమె తెలుగులో నుండి మళ్లీ బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది. అక్కడ అజయ్ దేవగన్ తో సిద్ధార్థ మల్హోత్రా తో సినిమాల్లో నటించింది. అయినప్పటికీ కూడా అక్కడ కూడా ఆమెకు మంచి హిట్ రాలేదు. ఇక ఇలా ఆమె సినిమాల్లో హీరోయిన్ గా చేసే నటి నుంచి కేవలం అతిథి పాత్రలో నటించే నటిగా మాత్రమే మిగిలిపోయింది.
సినిమాలో అవకాశాలు లేక ఆమె సినిమాల్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం మొదలు పెట్టింది. ఈ విధంగా బాలీవుడ్ లో ఓ సినిమాలో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించింది. ఆ తర్వాత కూడా ఆమెకు అలాంటి అవకాశాలే వచ్చాయి. ఇక అవి కూడా రావడం తగ్గిన నేపథ్యంలో ఆమె బోల్డ్ సినిమాలలో నటించడం మొదలుపెట్టింది.
అయితే తాజాగా ఆమె ఛత్రివాలి అనే బోల్డ్ హిందీ సినిమాలో నటించింది. అయితే అందులో ఆమె అభ్యంతర పాత్రలో నటించింది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. దీనికి మంచి స్పందన కూడా వచ్చింది. అయితే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కాండం క్వాలిటీని చెక్ చేసే పాత్రలో కనిపిస్తోంది.
Rakul Preet Singh పారితోషికం తగ్గించుకొని అభ్యంతర పాత్రల్లో నటిస్తున్న రకుల్..
అయితే ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రోని స్క్రూ వాలా నిర్మించారు. ఈ సినిమాను నేరుగా జీ5 ఓటిటి లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా జనవరి 20న విడుదల కానుంది. అయితే తెలుగు లో అంతటి స్టార్ డమ్ ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల్లో అవకాశాలు లేక పారితోషికం తగ్గించుకొని ఇలా అభ్యంతర పాత్రలో అలాగే చిన్న చిన్న పాత్రల్లో నటిస్తోందని టాక్ నడుస్తోంది. ఇది చూసిన ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు.