Rakul Preet Singh టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి తెలుగులో మాత్రమే కాకుండా దాదాపుగా సౌతిండియా పరంగా అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే నటి రకుల్ ప్రీత్ సింగ్ మొదటగా ఓ హిందీ చిత్రంలో చిన్నపాటి క్యారెక్టర్లో నటించి తన సినీ కెరీర్ ప్రారంభించింది. ఈ క్రమంలో తెలుగులో సినిమా ఆఫర్లు దక్కించుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మాస్ మాస్ మహారాజా రవితేజ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సాయి తేజ్ మరియు మరింత మంది స్టార్ హీరోల సరసన నటించే ఆఫర్లు దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. కానీ పాపం అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఇప్పటివరకు రకుల్ ప్రీత్ సింగ్ కి చెప్పుకోవటానికి సరైన హిట్ లేక పోవడంతో ఈ విషయం కొంతమేర ఈ అమ్మడిని బాధిస్తోంది.
అయితే ఈ మధ్యకాలంలో నటి రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలు, వీడియోలు వంటివి షేర్ చేస్తూ రోజురోజుకీ ఫాలోయింగ్ మరియు క్రేజ్ పెంచుకుంటోంది. అయితే తాజాగా నటి రకుల్ ప్రీత్ సింగ్ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ బికినీలో దిగినటువంటి ఫోటోలను షేర్ చేసింది. దీంతో కొందరు నెటిజన్లు రకుల్ ప్రీత్ సింగ్ అందాల ఆరబోతకు ఫిదా అయ్యారు.
అంతేకాకుండా రకుల్ ప్రీత్ సింగ్ తన నాజూకు అందాలతో మతి పోగొడుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే మరికొందరైతే రకుల్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంతమేర బొద్దుగా ఉండేదని కానీ సినిమా ఆఫర్ల కోసం నాజూకుగా తయారై నటనపై ఉన్నటువంటి డెడికేషన్ చూపించిందని రియల్లీ గ్రేట్ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల నటి రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో ప్రముఖ హీరో అజయ్ దేవగన్ హీరోగా నటించిన రన్ వే 34 అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది. దీంతో ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, తదితర భాషలలో నటి రకుల్ ప్రీత్ సింగ్ దాదాపుగా 6కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఇప్పటికే 3 చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.