Upasana -Ram Charan: తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి చరణ్ అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఉపాసన అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరి వివాహం జరిగి 11 సంవత్సరాలు అయినప్పటికీ వీరిద్దరూ మాత్రం తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఇక పెళ్లి తర్వాత 10 సంవత్సరాలకు ఈ దంపతులకు కుమార్తె పుట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇలా చిన్నారి రాకతో వీరి జీవితంలో ఆనందం మరింత రెట్టింపు అయిందని చెప్పాలి. ఈ విధంగా ఉపాసన రామ్ చరణ్ ప్రస్తుతం వృత్తిపరమైన జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇలా ఉపాసన కూడా అపోలో హాస్పిటల్ బాధ్యతలు అన్నింటిని చూసుకుంటూ భారీ స్థాయిలోనే డబ్బు సంపాదిస్తున్నారు. అలాగే రామ్ చరణ్ కూడా ఒక్కో సినిమాకు సుమారు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
ఎవరి సంపాదన వారిదేనా…
ఇద్దరు భారీ స్థాయిలో సంపాదిస్తూ ఉన్నప్పటికీ అన్ని విషయాలలోనూ భాగమైన సంపాదన విషయంలో మాత్రం ఇద్దరూ సపరేట్ అనే తెలుస్తోంది. చరణ్ సంపాదన గురించి ఎప్పుడూ కూడా ఉపాసన ప్రస్తావించారట అలాగే ఆ డబ్బును ఏం చేస్తున్నారని కూడా అడగరట ఇక చరణ్ సైతం ఉపాసన సంపాదించే డబ్బు గురించి ఎప్పుడు ఆరా తీరని తెలుస్తుంది. ఈమె సంపాదించే సంపాదనలో ఎక్కువ భాగం సామాజిక సేవ కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఉంటారు. ఉపాసనా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న రామ్ చరణ్ తనని ప్రోత్సహించారే తప్ప ఎప్పుడు కూడా ప్రశ్నించలేదని తెలుస్తోంది.