Upasana -Ramcharan: మెగా పవర్ స్టార్ గా రామ్ చరణ్ ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ అందుకున్నారో మనకు తెలిసిందే. ఇక ఈయన ఉపాసన అనే అమ్మాయిని ప్రేమించి గత 11 సంవత్సరాల క్రితం ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి ఈ జంట మధ్య ఎలాంటి గొడవలు లేకుండా చాలా అన్యోన్యంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఈ విధంగా భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ దంపతుల జీవితంలోకి క్లీన్ కార వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఉపాసన తన కూతురు ఆలనా పాలన చూసుకుంటూనే మరోవైపు తన వృత్తిపరమైనటువంటి బాధ్యతలను కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు.
ఇకపోతే కూతురు పుట్టిన తర్వాత రామ్ చరణ్ ఉపాసనల మధ్య ఒక విషయంలో తరచూ గొడవలు వస్తూనే ఉన్నాయట ఈ విషయం తెలిసినటువంటి కుటుంబ సభ్యులు ఈ గొడవలు ఎక్కడికి దారితీస్తాయోనని కంగారు పడుతున్నారని తెలుస్తుంది. మరి ఉపాసన రాంచరణ్ మధ్య తలెత్తిన ఆ గొడవలు ఏంటి అనే విషయానికి వస్తే… కూతురు పుట్టుక ముందు వరకు ఉపాసన చరణ్ విషయంలో అన్ని తానే చూసుకునే వారట చిన్నప్పటినుంచి చాలా క్రమశిక్షణగా పెరిగిన ఉపాసన టైం కు చాలా వాల్యూ ఇస్తారట. ప్రతిదీ టైం ప్రకారమే చేయాలని తన భర్తతో చెప్పడమే కాకుండా దగ్గరుండి ఆయనని టైంకి ప్రతి పని చేయించేవారు. ఇక రామ్ చరణ్ కు ఏ పని అయినా తనకు నచ్చినపుడు చేయడం ఇష్టం కానీ ఉపాసనను పెళ్లి చేసుకున్న తర్వాత తప్పనిసరి పరిస్థితులలో తాను చెప్పిన విధంగా నడుచుకోవాల్సి వస్తుంది.
టైం సెన్స్ ఫాలో కావాల్సిందే…
ఇక కూతురు పుట్టిన తర్వాత ఉపాసన తన కూతురి ఆలనా పాలనలో బిజీగా ఉండగా రామ్ చరణ్ మాత్రం పూర్తిగా టైం సెన్స్ ఫాలో అవ్వడం మానేశారట. దీంతో ఉపాసన రాంచరణ్ మద్య గొడవలు కూడా తలెత్తుతూ ఉంటాయనీ, ఈ విషయంలో వీరిద్దరూ గొడవ పడుతున్నప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా ఏమాత్రం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటారట. మధ్యలో ఇన్వాల్వ్ అయితే ఈ గొడవలు ఎక్కడికైనా దారి తీయవచ్చు అని కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ భార్యాభర్తల గొడవల్లోకి వెళ్లారని పోట్లాడినంత సేపు పోట్లాడి రామ్ చరణ్ ఉపాసన తిరిగి ఒకటవుతారని తెలుస్తోంది. అయితే ఏ విషయమైనా టైం కి చేయడం టైం సెన్స్ ఫాలో కావడం ఉపాసనకు ఇష్టం కావడంతోనే తన భర్తని కూడా అలాగే ఉండమని ఆమె చెబుతూ ఉంటారని తెలుస్తోంది. ఇలా కంట్రోల్ చేస్తున్నటువంటి ఉపాసన కూతురిని ఇంకా ఎలాంటి క్రమశిక్షణలో పెంచుతారు చెప్పాల్సిన పని లేదు.