Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇటీవల ఆస్కార్ అవార్డ్ ప్రధానోత్సవం కోసం అమెరికా వెళ్ళిన రామ్ చరణ్ ఆయన భార్యతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ లో ఇండియా టుడే నిర్వహించిన కాన్ క్లైవ్ 2023 లో పాల్గొన్నాడు. అయితే అంతకు ముందు రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి కేంద్ర హోం మంత్రి అమీత్ షాతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో దేశానికి ఆస్కార్ వచ్చినందుకు అమీత్ షా రామ్ చరణ్ ను సత్కరించారు.
ఆ తర్వాత కాన్ క్లైవ్ లో పాల్గొన్న రామ్ చరణ్ మాట్లాడుతూ ఆస్కార్ కు సబంధించిన విషయాలు పంచుకున్నారు. ఈ సదర్భంగా రాజమౌళి గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు చరణ్ మాట్లాడుతూ…ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రాజమౌళి చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు . ఇన్నేళ్ళ తెలుగు చలనచిత్రం చరిత్రలో.. ఆస్కార్ సాధించిన ఘనత రాజమౌళి మాత్రమే దక్కుతుంది.నాటు నాటు పాట ఆస్కార్ సాధిండం వెనుక చాలా మంది కష్టం ఉంది. ముఖ్యంగా జక్కన్న స్వీట్ టార్చర్ పెట్టడం వల్లే మేము అంత బాగా డాన్స్ చేయగలిగాం. రాజమౌళి మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ చెప్పుకొచ్చాడు.
Ram Charan: వేరే డైరెక్టర్లు మాతో సినిమా చేయలేరు…
అలాగే ఒక రకంగా చెప్పాలంటే ఆయన పని రాక్షసుడు.. ఆయన పనిని ఆయన చాలా గౌరవిస్తారు. 14 ఏళ్ల క్రితం మగధీరతో నాకు లైఫ్ ఇచ్చారు. అందకే నాకు నాన్న, బాబయ్ తరువాత రాజమౌళి చాలా ఇష్టమైన వ్యక్తి రాజమౌళి ” అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తారక్ ను నన్ను కలిసి సినిమా చేయాలనే సాహసం రాజమౌళి మాత్రమే చేయగలిగాడు.. వేరే దర్శకులు అయితే ఇది సాధ్యం అయ్యేదికాదేమో అన్నారు చరణ్. అయితే తండ్రీ, బాబాయ్ తర్వాత భార్యని వదిలేసి రాజమౌళి అంటే ఇష్టం అని రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.