Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈయన చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిరుత వేగంతోనే ఇండస్ట్రీలో దూసుకుపోతూ మంచి సక్సెస్ సాధించారు. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నటువంటి రామ్ చరణ్ తదుపరి మగధీర సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈయన ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో హీరోగా పేరు సంపాదించుకోవడమే కాకుండా హాలీవుడ్ అవకాశాలను కూడా అందుకుంటున్నారు.
ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి రామ్ చరణ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ భారీగా ఆస్తులు సంపాదించారని తెలుస్తుంది. ఇలా ఈయన హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. ఇలా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాంచరణ్ దాదాపు 30 కి పైగా బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ఒక్కో సినిమాకు 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటూ బిజీగా ఉన్నటువంటి చరణ్ నెలకు మూడు కోట్లకు పైగా ఆదాయం అందుకుంటున్నారని తెలుస్తోంది.ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఈయన దాదాపు 1300 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్టు సమాచారం.
Ram Charan: నిర్మాతగా సక్సెస్ అయిన చరణ్…
ఇవే కాకుండా ఖరీదైన ఇల్లు కార్లు కూడా ఉన్నాయి వీటి విలువ దాదాపు 50 కోట్లకు పైగా ఉంటాయని సమాచారం. ఇక ఖరీదైన కార్లు మాత్రమే కాకుండా చరణ్ కి ప్రవేట్ జెట్ కూడా ఉంది. ఇలా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా ఈయన దూసుకుపోతున్నారు.ఇక హీరోగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధించిన రాంచరణ్ తన తండ్రి చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో నిర్మాతగా మారిపోయారు. ఇలా నిర్మాతగా కూడా చరణ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ సాధించారని చెప్పాలి. ఆస్తులు విలువ తెలిసి అభిమానులు, నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.