Ram Charan: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRRసినిమా ద్వారా రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయి లో విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నటి, 2017వ మిస్ యూనివర్స్ విన్నర్, అందాల భామ మానుషి చిల్లార్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సరసన పృథ్వీ రాజ్ సినిమాలో నటించారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈమె నటుడు రామ్ చరణ్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ కు అభిమానిగా మారిపోయానని తెలిపారు.
పృథ్వీ రాజ్ ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రం ఎవరితో చేయాలని భావిస్తున్నారని ప్రశ్నించగా..ఈమె టక్కున రామ్ చరణ్ పేరు బయటపెట్టారు.తనలో అద్భుతమైన నటన నైపుణ్యం ఉందని తనతో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని వెల్లడించారు. అదేవిధంగా రామ్ చరణ్ కు పెళ్లి కాకపోయి ఉంటే తనతో డేట్ కి వెళ్లే దానిని అంటూ రామ్ చరణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తనతో డేట్ కి వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించగా ఈమె సమాధానం చెబుతూ…తనతో కలిసి ఇష్టమైన సినిమా చూస్తూ, ఫేవరెట్ ఫుడ్ తింటూ ఎన్నో విషయాల గురించి చర్చించుకుంటూమని తెలిపారు.

Ram Charan: తదుపరి సినిమా రామ్ చరణ్ తో చేస్తా..
ఈ విధంగా ఈ ముద్దుగుమ్మ హీరో రామ్ చరణ్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతు న్నాయి. రామ్ చరణ్ కు పెళ్లి అయిపోయిందని తెగ బాధ పడిపోయింది. ప్రస్తుతం ఈమె చేసిన ఈ వ్యాఖ్యలపై ఎంతోమంది మెగా అభిమానులు స్పందిస్తూ రామ్ చరణ్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ మెగా కోడలికి ఫుల్ కోపం తెపించావు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే అక్షయ్ కుమార్ సరసన ఈమె పృథ్వీ రాజ్ సినిమాలో అక్షయ్ భార్య పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన దక్కించుకుంది.