Ram Charan: మెగాస్టార్ రామ్ చరణ్ ఇటీవల అమెరికాలో జరిగిన ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవ వేడుకలలో పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈవెంట్ తర్వాత రామ్ చరణ్ నేరుగా ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో ఆస్కార్ విశేషాల గురించి రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత నెపోటిజం గురించి రాంచరణ్ ని ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇండియా టుడే కాన్ క్లేవ్ ఈవెంట్ లో నేపోటిజం గురించి రామ్ చరణ్ ని ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ…” అసలు ఈ నేపోటిజమ్ ఏమిటో నాకు అర్థం కావటం లేదు. బందు ప్రీతీ ఉందని భావించడం వల్ల వల్లే దీని గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత చరణ్ మాట్లాడుతూ.. అవును నేను మా నాన్న వల్లే ఇలా ఇక్కడ ఉన్నాను. చిన్నప్పటి నుండి ఇండస్ట్రీలో పెరగటం వల్ల నాకు నటన అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో ఇండస్ట్రీలో మంచి సినిమాలు చేయాలనే తపనతో నిర్మాతలను, దర్శకులను కలుస్తున్నాను. నాకు నటించటం అంటే ఇష్టం. ఇలా నా మనసుకు నచ్చిన పని చేయటం వల్లే 14 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు.

Ram Charan: మా నాన్న వల్లే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను…
ఆ తర్వాత మాట్లాడుతూ..నేను మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. కానీ ఇక్కడ రాణించాలంటే టాలెంట్ ఉండాలి. అది లేకపోతే ఇక్కడ సక్సెస్ అవ్వలేము. సినిమాలో ఇండస్ట్రీ లో హీరోగా అడుగుపెడుతున్నప్పుడు మా నాన్న నాకు ఒక మాట చెప్పారు. ఇండస్ట్రీలో సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా మన కోసం పని చేసేవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. ఎప్పటికీ ఆయన మాటలు నేను గుర్తుపెట్టుకుంటాను” అంటూ నెపోటిజమ్ గురించి రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.