Ram Charan : ఆ పుస్తకం చదవండి అంటూ అభిమానులకు సూచించిన రామ్ చరణ్.. అంతగా అందులో ఏం ఉందంటే?

Akashavani

Ram Charan : టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలియని వారెవరూ లేరు. చిరుత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చరణ్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తన నటనకు మంచి సక్సెస్ సొంతం చేసుకున్నాడు. మగధీర సినిమాతో మాత్రం ఎనలేని క్రేజ్ ను సంపాదించుకొని ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు.

ఆ తర్వాత పలు సినిమాలలో నటించగా ఆ సినిమాలు ఆయనకు పరాజయాలు కాగా.. ఆ సమయంలోనే రంగస్థలం సినిమాతో ప్రేక్షకుల విమర్శల కు ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇటీవలే దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.

తన నటనతో ఆలిండియా ప్రేక్షకులను మరో లెవెల్లో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఈయన వరుస ప్రాజెక్టులకు సైన్ కూడా చేశాడు. ఇక ప్రస్తుతం ఈయన ఆర్ సి 15 సినిమాలో బిజీగా ఉన్నాడు. కాగా ఈ సినిమాకు డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో చరణ్ మరోసారి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్, పంజాబ్ లలో పూర్తి కాగా ప్రస్తుతం వైజాగ్ లో నడుస్తుంది. ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడు.

Ram Charan : ఆ పుస్తకం చదవండి అంటూ అభిమానులకు సూచించిన రామ్ చరణ్.. అంతగా అందులో ఏం ఉందంటే?
Ram Charan : ఆ పుస్తకం చదవండి అంటూ అభిమానులకు సూచించిన రామ్ చరణ్.. అంతగా అందులో ఏం ఉందంటే?

Ram Charan: రామ్ చరణ్ అభిమానులకు సూచించిన పుస్తకం ఇదే..

తాజాగా తన ట్విట్టర్ వేదికగా ఒక విషయాన్ని షేర్ చేసుకున్నాడు. అందులో ఒక పుస్తకం గురించి చెబుతూ.. సందీప్ ఏం భట్నాగర్ రచించిన ఆఫ్ స్ప్రింగ్ నవలను చదువుతున్న తాను తన అభిమానులను కూడా చదవమని సూచించాడు. సంప్రదాయాలు, కుటుంబం, ప్రేమ ఇలా జీవితంలో ఎదురయ్యే అన్ని విషయాలను.. దానివల్ల మనం ఎదుర్కొనే పరిస్థితులను పదునైన కథల ద్వారా ఈ పుస్తకం వివరిస్తుంది.

- Advertisement -