Ram Charan: ఒకేరోజు అటువంటి పరిస్థితి ఎదుర్కొన్న రామ్ చరణ్!

Akashavani

Ram Charan: టాలీవుడ్ ప్రేక్షకులు హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటనలో తండ్రికి తగ్గ కొడుకు గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక మగధీర సినిమాతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఆపై పలు సినిమాల్లో నటించి స్టార్ హీరో హోదాను సంపాదించుకున్నాడు చరణ్. ఇక ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఆ సినిమాలో తన అద్భుతమైన నటన తో బీ టౌన్ ప్రేక్షకులను మరో లెవల్ లో ఫిదా చేసాడు. ఈ సినిమా రామ్ చరణ్ ఎన్టీఆర్ ల కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది.

ప్రేక్షకుల అంచనాలను క్రాస్ చేసి ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మరో లెవెల్ ఆకట్టుకుంది. మొత్తానికి రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో రామ్ చరణ్ కలిసి చేసిన సినిమా ఆచార్య. ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొలిపింది. కానీ విడుదలైన తర్వాత భారీ డిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది.

Ram Charan: ఒకేరోజు అటువంటి పరిస్థితి ఎదుర్కొన్న రామ్ చరణ్!
Ram Charan: ఒకేరోజు అటువంటి పరిస్థితి ఎదుర్కొన్న రామ్ చరణ్!

Ram Charan: ఈ రెండు సినిమాలు ఒకేరోజు ఓటీటీ లో విడుదల అవుతున్నాయి!

ఇక త్రిబుల్ ఆర్ సక్సెస్ తో చిల్ అవుతున్న రామ్ చరణ్ ఆచార్య సినిమాతో మరో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం తప్పలేదు. ఇదంతా పక్కన పెడితే ఈ రెండు సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఓకే రోజు స్ట్రీమింగ్ అవుతున్నాయి ఇది నిజానికి ఎంతో గమనార్హం. త్రిబుల్ ఆర్ సినిమా మే 20న జి ఫైవ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

ఇక అదే రోజు ఆచార్య అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది. అయితే రామ్ చరణ్ తను నటించిన రెండు సినిమాలు ఒకే రోజు ఓటీటీ లో విడుదల అవుతాయని అసలు ఊహించి ఉండడు అని తెలుస్తుంది.

- Advertisement -