Ram Charan: రామ్ చరణ్ కు ఊపిరాడకుండా చేసిన అభిమానులు.. అక్కడ కనిపించడంతో?

Akashavani

Ram Charan: తెలుగు ప్రపంచానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చరణ్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి అద్భుతమైన నటనతో వారసత్వం నిలబెట్టుకున్నాడు. ఇక ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు.

ఆ తర్వాత కొన్ని పరాజయాలు చరణ్ ఎదుర్కొన్నప్పటికీ.. రంగస్థలం సినిమాతో ప్రేక్షకుల విమర్శల కు ప్రశంసలు అందుకున్నాడు. మొత్తానికి రామ్ చరణ్ టాలీవుడ్ స్టార్ హీరోల లో తాను ఒకడిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక ఇటీవలే దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ చిత్రం ద్వారా హీరో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.

తన నటనతో ఆలిండియా ప్రేక్షకులను మరో లెవెల్లో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ సి 15 సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాకు డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో చరణ్ మరోసారి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

 Ram Charan: రామ్ చరణ్ కు ఊపిరాడకుండా చేసిన అభిమానులు.. అక్కడ కనిపించడంతో?
Ram Charan: రామ్ చరణ్ కు ఊపిరాడకుండా చేసిన అభిమానులు.. అక్కడ కనిపించడంతో?

Ram Charan: రామ్ చరణ్ కు తన అభిమానులు ఊపిరాడకుండా చేయడానికి కారణం ఇదే!

కాగా ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలో హీరో రామ్ చరణ్ వైజాగ్ వెళ్ళాడు. ఆ సినిమాలో కొన్ని సీన్ లను ఆర్ కే బీచ్ లో షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మధురవాడ లో పాత పోలీస్ స్టేషన్ దగ్గర్లో ఒక అపార్ట్మెంట్ ఉంది. అక్కడ కూడా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు.

ఇక రామ్ చరణ్ మధురవాడ వచ్చాడు అన్న విషయం తెలుసుకొని తన అభిమానులు ఒక రేంజ్ లో తరలివచ్చారు. తమ హీరో తో ఫోటో దిగడానికి ఒక రేంజ్ లో ఎగబడ్డారు. మొత్తానికి తన అభిమానులు రామ్ చరణ్ కు ఊపిరి ఆడకుండా చేసారు.

- Advertisement -