Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరికొద్ది రోజులలో తండ్రిగా ప్రమోట్ కాబోతున్నారు. రామ్ చరణ్ ఉపాసన దంపతులు పెళ్లి జరిగిన తర్వాత 10 సంవత్సరాలకు పిల్లల గురించి ఆలోచించారు. ప్రస్తుతం ఉపాసన ఏడవ నెల ప్రెగ్నెంట్ అయితే మరో రెండు నెలలలో ఈమె బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తెలియడంతో మెగా వారసుడి కోసం అభిమానులు కుటుంబ సభ్యులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఉపాసన కూడా ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇకపోతే తాజాగా రామ్ చరణ్ సైతం తనకు పుట్టబోయే బిడ్డ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అలాగే కార్యక్రమాలకు కూడా ఈయన ముఖ్యఅతిథిగా హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాశ్మీర్ లో జరుగుతున్న g 20 సదస్సులో ఈయన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇలాంటి అవకాశాన్ని అందుకున్న మొదటి హీరోగా రామ్ చరణ్ పేరు సంపాదించుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఈయన జపాన్ గురించి మాట్లాడుతూ జపాన్ కు తనకు పుట్టబోయే బిడ్డకు మంచి అనుబంధం ఉందని తెలియజేశారు.
Ramcharan: నా బిడ్డకు జపాన్ తో సంబంధం ఉంది…
ఉపాసన ప్రస్తుతం ఏడవ నెల ప్రెగ్నెంట్ అని తమకు పుట్టబోయే బిడ్డకు జపాన్ తో సంబంధం ఉందని అందుకే జపాన్ అంటే తనకు ఎప్పుడు ప్రత్యేకమేనని రామ్ చరణ్ తెలియజేశారు. అసలు ఈ మ్యాజిక్ మొత్తం జపాన్లోనే జరిగింది అంటూ నవ్వుతూ ఈయన తన బిడ్డ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక రామ్ చరణ్ నటించిన RRR సినిమా జపాన్ లో విడుదలవుతున్న సమయంలో ఉపాసన రామ్ చరణ్ జపాన్లో పర్యటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ పర్యటన ముగించుకొని ఇండియా వచ్చిన తర్వాత వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ చిరంజీవి ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.