Ram Gopal Varma: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎన్నికలకు ముందే చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయని చెప్పాలి.అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయగా ప్రతిపక్ష నాయకులకు కూడా తగ్గేదేలే అన్నట్టు అధికార నేతల పై విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసిపి మంత్రి రోజామెగా బ్రదర్స్ ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే మెగా బ్రదర్స్ స్పందిస్తూ తనకు కౌంటర్ ఇచ్చారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువశక్తి పేరిట ఓ బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన రోజా గురించి మాట్లాడుతూ తనకు కౌంటర్ ఇచ్చారు.
మెగా బ్రదర్స్ పై రోజా చేస్తున్న వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ రోజాను ఏకంగా డైమండ్ రాణితో పోలుస్తూ చివరికి ఆ డైమండ్ రాణి తో కూడా నేను మాటలు పడాల్సి వస్తుంది. ఛీ నా బతుకు చెడ…ప్రతి ఒక్క ఎదవ సన్నాసులతో కూడా తిట్ల తినాల్సి వస్తుంది అంటూ ఈయన వైసిపి నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక మహిళ నేత సహనటిని పట్టుకొని డైమండ్ రాణి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్రదుమారం. ఈ క్రమంలోనే ఈ విషయంపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ స్పందించారు.
Ram Gopal Varma: ఇస్పెట్ రాజా అంటూ పవన్ పై విరుచుకుపడ్డ వర్మ..
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రోజాను డైమండ్ రాణి అనడంతో ఈయన తనకు మద్దతు తెలుపుతూ పవన్ కళ్యాణ్ కు తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. డైమండ్ రాణి అనే బిరుదుతో ఒక మహిళను కించపరిచినటువంటి వ్యక్తి కూడా ఇస్పెట్ రాజా అని తెలుసుకోవాల్సిన కనీస జ్ఞానం ఉండాలని,ఈ విషయాన్ని తాను ఒక ఫ్యాన్ గా కోరుకుంటున్నాను అంటూ రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు. ఇలా పవన్ కళ్యాణ్ గురించి వర్మ మాట్లాడుతూ తనని ఇస్పెట్ రాజా అనడంతో ఇది కాస్త వైరల్ గా మారుతుంది ఈ క్రమంలోనే పవన్ అభిమానులు వర్మకు తమదైన శైలిలో సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు.