Ram Gopal Varma: ఈసారి బాలీవుడ్ పై రామ్ గోపాల్ వర్మ టార్గెట్.. ఇక ఆ సినిమాలు అక్కడికే పరిమితం అంటూ!

Akashavani

Ram Gopal Varma: తెలుగు రాష్ట్రాల ప్రజలకు రామ్ గోపాల్ వర్మ పేరు ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఎన్నో వివాదాలు తట్టిలేపి వివాదాస్పద డైరెక్టర్ గా ఒక పేరు తెచ్చుకున్నాడు. ఇక మాఫియా, హారర్ నేపథ్యంలో చిత్రాలకు ప్రాణం పోయడం తనలోని ప్రత్యేకత అని చెప్పవచ్చు.

ఇక రామ్ గోపాల్ వర్మ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమాలు శివ, క్షణక్షణం,రంగీలా, సత్యా కంపెనీ లు. ఈ సినిమాలు రామ్ గోపాల్ వర్మను డైరెక్టర్ గా ఒక స్థాయిలో నిలబెట్టాయి. మొత్తానికి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్థాయి దర్శకుడిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక వర్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ బిజీగా ఉంటాడు.

చెప్పాలంటే ఇతడు ఇంట్లో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటాడని చెప్పవచ్చు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియా ప్రియులను ఆశ్చర్య పరుస్తూ ఉంటాడు. ఇక ఇదే క్రమంలో బాలీవుడ్ గురించి ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలీవుడ్ పని అయిపోయిందంటూ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేసాడు. టాలీవుడ్ ను పొగుడుతూ బాలీవుడ్ ను దెప్పి పొడిచాడు.

Ram Gopal Varma: ఈసారి బాలీవుడ్ పై రామ్ గోపాల్ వర్మ టార్గెట్.. ఇక ఆ సినిమాలు అక్కడికే పరిమితం అంటూ!
Ram Gopal Varma: ఈసారి బాలీవుడ్ పై రామ్ గోపాల్ వర్మ టార్గెట్.. ఇక ఆ సినిమాలు అక్కడికే పరిమితం అంటూ!

Ram Gopal Varma: వర్మ బాలీవుడ్ ఈ విధంగా అవమానించాడు!

సౌత్ సినిమాలో భారీగా పుంజుకోవడం.. బాలీవుడ్ సినిమాలు పడి పోవడం చూస్తుంటే.. కేవలం ఓటీటీ లకే బాలీవుడ్ సినిమాలు పరిమితమవుతాయి అన్నట్లు అనిపిస్తుంది అని వర్మ తెలిపాడు. ఇక పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయినప్పటి నుంచి వర్మ బాలీవుడ్ ను ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నాడు.

ప్రస్తుతం వర్మ బాలీవుడ్ గురించి చేసిన కామెంట్లు బి టౌన్ ను అవమాన పరిచేలా ఉన్నాయి. ఇక రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు చూసి బీ టౌన్ వర్గం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

- Advertisement -