Ram Pothineni: సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు అభిమానులు ఉంటారు అనే విషయం మనకు తెలిసిందే. ఇలా హీరో హీరోయిన్లపై అభిమానంతో అభిమానులు వారి పేర్లను వారి పిల్లలకు పెట్టుకోవడం మనం చూస్తుంటాము లేదా వారి పేరుపై కొన్ని సామాజిక సేవ కార్యక్రమాలు చేయడం మనం చూస్తుంటాము ఇలా ఎంతోమంది తమకి ఇష్టమైనటువంటి సెలబ్రిటీల పేర్లను వారి పిల్లలకు పెట్టుకోవడం మనం చూస్తున్నాము అయితే హరిహర అనే ఒక వ్యక్తి మాత్రం హీరో రామ్ పోతినేని అంటే ఎంతో అభిమానిస్తారు.
ఈయన హీరో రామ్ కి డై హార్ట్ ఫ్యాన్. ఇకపోతే తాజాగా హరిహర దంపతులకు ఒక కుమారుడు జన్మించారు దీంతో ఆ కుమారుడికి నామకరణం చేశారు అయితే హీరో రామ్ పై ఉన్నటువంటి అభిమానంతో హీరో పేరు పెట్టకుండా ఆయన నటిస్తున్న సినిమా పేరు పెట్టి అందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈయన స్కంద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో ఆ అభిమాని తన కుమారుడికి స్కంద అని నామకరణం చేశారు.
కొడుకుకు స్కంద పేరు పెట్టిన అభిమాని…
ఇలా హీరోపై అభిమానంతో తన పేరు కాకుండా తన సినిమా పేరు పెట్టుకోవడం ఏంటి అని ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక బోయపాటి వాంటెడ్ సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం స్కంద. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కాస్త ఆలస్యమైంది అయితే సెప్టెంబర్ 28వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ సరసన నటి శ్రీ లీల నటిస్తున్నారు. బోయపాటి డైరెక్షన్ కావడంతో ఈ సినిమాపై ప్రతి ఒక్కరిలోనూ బారీ అంచనాలే నెలకొన్నాయి. మరి ఈ సినిమా ద్వారా ఆయన సక్సెస్ అందుకుంటారా లేదా తెలియాల్సి ఉంది.