Rambha Daughter: సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆత్రుత కనబరుస్తుంటారు.వారి వ్యక్తిగత విషయాల గురించి మాత్రమే కాకుండా వారి పర్సనల్ విషయాలను గురించి కూడా తెలుసుకోవడానికి ఎంతో ఆత్రుత కనబరుస్తుంటారు. ఇక వారికి సంబంధించిన ఏ చిన్న విషయం తెలిసిన అభిమానులు పెద్ద ఎత్తున ఆ విషయాన్ని వైరల్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రంభ గురించి చెప్పాల్సిన పనిలేదు.
అద్భుతమైన సినిమాలలో నటిగా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రంభ ప్రస్తుతం సినిమాలకు దూరంగా విదేశాలలో స్థిరపడిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈమెకు ముగ్గురు సంతానం కలరు. సినిమాలకు దూరమైన రంభ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే రంభ తాజాగా తన పెద్ద కుమార్తె లాన్య ఇంద్ర కుమార్ ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. లాన్య అచ్చ తెలుగు ఆడపిల్లగా ముస్తాబైన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Rambha Daughter:కెనడాలో స్థిరపడిన రంభ…
ఈ విధంగా రంభ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసినా అభిమానులు ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తూ రంభ కూతురు అచ్చం తల్లి పోలికలతోనే ఉన్నారని తల్లిని మించిన అందంతో ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. రంభ 2010లో కెనడాకు చెందిన పారిశ్రామికవేత్త ఇంద్ర కుమార్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. పెళ్లి తర్వాత ఈమె కెనడాలో స్థిరపడిపోయారు. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ రంభ ఎంతో బిజీగా ఉన్నారు.