Rambha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రంభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉన్నారు.ఒకానొక సమయంలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రంభ అనంతరం పలు ఐటెం సాంగ్స్ ద్వారా కూడా సందడి చేశారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రంభ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పలువురు సెలబ్రిటీల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలను తెలియజేశారు.
ఈ సందర్భంగా రంభ మాట్లాడుతూ…తనకు ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోయిన్లలో త్రిష అంటే చాలా ఇష్టమని తాను చాలా ఆప్యాయంగా మాట్లాడతారని తెలిపారు. ఇక తనకు మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోల సినిమాలలో చేయాలని ఉంది అంటూ ఈ సందర్భంగా తన మనసులో కోరికను బయటపెట్టారు.ఇక తాను నటించినా ఐటమ్ సాంగ్స్ లో తనకు నాచోరే నా చోరే అనే సాంగ్ అంటే చాలా ఇష్టం అని తెలిపారు. ఇందులో తారక్ ఎంతో కష్టపడి డాన్స్ చేసినప్పటికీ తనకు క్రెడిట్ వచ్చిందని రంభ వెల్లడించారు.
Rambha: ఎన్టీఆర్ డెడికేషన్ కి పిచ్చెక్కిపోతుంది…
ఇక తనకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అంటే చాలా ఇష్టమని తెలియజేశారు. ఇక ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆయన డాన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కనుక డాన్స్ చేస్తుంటే కళ్ళు అర్పకుండా చూడాలనిపిస్తుందని తెలిపారు.ఆయన డెడికేషన్ చూస్తే పిచ్చెక్కుతుందని ఆయన ముందు మైఖేల్ జాక్సన్ వచ్చినా కూడా తనకు ఎన్టీఆర్ ఏ బెస్ట్ డాన్సర్ అని ఇది తన అభిప్రాయం మాత్రమే అంటూ రంభ వెల్లడించారు.ఇలా ఎన్టీఆర్ డాన్స్ గురించి రంభ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.