Ramcharan: కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ” కీసీ కా భాయ్ కిసీ కీ జాన్ ” అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ కూడా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి ఏంటమ్మా అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ చేసిన రెండు రోజులలో అత్యధిక వ్యూస్ సాధించింది. ఈ పాటలు సల్మాన్ ఖాన్ వెంకటేష్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కలిసి చిందులేసాడు. దీంతో ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
సోషల్ మీడియాలో ఈ పాటకు వస్తున్న రెస్పాన్స్ వల్ల తాజాగా ఈ సాంగ్ షూటింగ్ కి సంబంధించిన బీటిఎస్ వీడియోని చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. ఈ వీడియోలో సాంగ్ షూటింగ్ సమయంలో జరిగిన సన్నివేశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ సాంగ్ లో నటించిన నటి నటులు పాట గురించి వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రామ్ చరణ్ కూడా మాట్లాడుతూ… ఈ సాంగ్ చేసేటప్పుడు అందరం చాలా ఎంజయ్ చేస్తూ డాన్స్ అదరగొట్టేశాం. ఇలా ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి పాటలో నటించటంతో నా కల నిజమైనట్లుగా ఉంది . ఇది మరిచిపోలేని అనుభూతి అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ramcharan: మరిచిపోలేని అనుభూతి..
ఇదిలా ఉండగా గతంలో చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో నటించాడు. ఇక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్న
” కీసీ కా భాయ్ కిసీ కీ జాన్ ” సినిమాలో రామ్ చరణ్ కూడా గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన ఏంటమ్మా అనే పాటకి షబ్బీర్ అహ్మద్ లిరిక్స్ అందించగా.. పాయల్ దేవ్ సంగీతం అందించాడు. ఇక ఈ పాటని విశాల్ డడ్లాని, రఫ్లార్, పాయల్ దేవ్ ఆలపించారు. ఇక ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాష్టర్ కొరియోగ్రఫీ చేసారు.