Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్ కొంతకాలానికి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఇక ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల రాంచరణ్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పాకిపోయింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ తరచు వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టి మరొక రికార్డ్ క్రియేట్ చేశాడు.
ప్రముఖ సినీ వెబ్ సైట్ IMDB ప్రతి వారం, ప్రతి నెల, ప్రతీ ఏడాది.. ఇండియాలో టాప్ 10 సెలబ్రిటీల లిస్ట్ ఇస్తుంది. ఇందులో ఫ్యాన్స్ ఓటింగ్ తో పాటు స్టార్స్ కు ఉన్న పాపులారిటీ, ఇమేజ్.. దానితో పాటు ఆ హీరోల యాక్టివిటీలను బట్టి IMDB ఈ లిస్ట్ ని రిలీజ్ చేస్తుంది. ఈ సర్వేలో.. గత కొన్నాళ్లుగా మన టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా టాప్ 10 లిస్ట్ లో ఏదో ఒక ప్లేస్ లో ఉంటూ వస్తున్నారు. ఇక తాజాగా ఈ వారం రిలీజ్ చేసిన IMDB లిస్ట్ లో షారుఖ్, సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్ హీరోలను వెనక్కి నెట్టి మరి రామ్ చరణ్ మొదటి ప్లేస్ లో నిలబడి మరొక రికార్డు క్రియేట్ చేశాడు. దీంతో రామ్ చరణ్ అభమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Ramcharan: బాలీవుడ్ హీరోలను వెనక్కి నెట్టిన చరణ్…
ఇక ఈవారం విడుదలైన IMDB లిస్ట్ లో రామ్ చరణ్ మొదటి స్థానంలో నిలవగా.. బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్ రెండవ స్థానంలో నిలిచింది. ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ మూడో స్థానంలో నిలువగా, అందాల నటి దీపికా పదుకొనే నాలుగోవ స్థానం . ఇక కైవసం చేసుకుంది. ఇక ఐదవ స్థానంలో కండలవీరుడు సల్మాన్ నిలువగా… యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆరవ స్థానంలో నిలిచాడు. ఇక ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ఏడవ స్థానంలో నిలువగా.. రాశిఖన్నా ఎనిమిదవ స్థానం, అమీర్ ఖాన్ తొమ్మిదవ స్థానం, సన్నీ కౌశల్ పదవ స్థానంలో నిలిచారు.