Ramcharan pet Dog: ఇటీవల మెగా ఇంట్లో వారసురాలు అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. వారసురాలి రాకతో మెగా కుటుంబంలో ఆనందాలు వెళ్లివిరుస్తున్నాయి. అలాగే రామ్ చరణ్ కూడా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం తన కూతురు క్లింకారతో సమయం గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రామ్ చరణ్ పెట్ డాగ్ రైమ్ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు మూగజీవాల పట్ల అమితమైన ప్రేమ. అందువల్ల ఉపాసన కూడా మూగజీవాల సంరక్షణ కోసం తన వంతు సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.
ఇదిలా ఉండగా రామ్ చరణ్ కి చిన్ననాటి నుండి గుర్రాలు అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ తన ఇంట్లో ఎన్నో గుర్రాలను పెంచుతున్నాడు. అలాగే చరణ్ కి తన పెట్ డాగ్ రైమ్ అన్నా కూడా చాలా ఇష్టం. చరణ్ ఎక్కడికి వెళ్లినా కూడా రైమ్ తన పక్కనే ఉండేలా చూసుకుంటాడు. మూవీ ప్రొమోషన్స్, ఇంటర్వ్యూస్, ట్రిప్స్ ఇలా ఎక్కడికెళ్లినా రైమ్ ని చరణ్ తనతో పాటు తీసుకెళుతూ ఉంటాడు. దీంతో రైమ్ కి సంబందించిన ఫొటోస్ , వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం రైమ్ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Ramcharan pet Dog: చెల్లిపై కన్నేసి ఉంచాను…
రామ్ చరణ్‌కి పాప పుట్టిన తర్వాత రైమ్ ఆ పాప నీ అస్సలు వదలటం లేదట. రాత్రి, పగలు అని తేడా లేకుండా పాప కోసం జాగ్రత్తగా కాపలా కాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉయ్యాలలో ఉన్న మెగా ప్రిన్సెస్ క్లింకార ను రైమ్ జాగ్రత్తగా చూస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆల్‌వేస్ రైమ్ (alwaysrhyme) అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో క్లింకార, రైమ్ ఫొటో ఒకటి పోస్ట్ చేశారు. ‘నైట్ డ్యూటీ చేస్తున్నా.. నా చెల్లెలిపై ఓ కన్నేసి ఉంచాను’ అని క్యాప్షన్ ఇచ్చి ఫోటో పోస్ట్ చేశారు. ఈఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.