Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున ఆయనకు అభిమానులు సినిమా సెలబ్రిటీలు కుటుంబ సభ్యుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెళ్ళు వెత్తాయి. మార్చ్ 27వ తేదీ రామ్ చరణ్ తన పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం టాలీవుడ్ సెలబ్రిటీ అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానం పంపించి పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇలా టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా మెగా కాంపౌండ్ లో సందడి చేశారు.

ఇక రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్
చిరంజీవి తన కొడుకుకు ముద్దు పెడుతూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ చాలా గర్వంగా ఉంది నాన్న హ్యాపీ బర్త్ డే అంటూ ఎంతో ఆప్యాయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక ఉపాసన సైతం ఇదివరకు ఎప్పుడూ చూడనటువంటి ఫోటోని షేర్ చేస్తూ హ్యాపీ హ్యాపీ బర్త్ డే బెస్టీ అంటూ లవ్ సింబల్ ని షేర్ చేస్తూ తనకు శుభాకాంక్షలు తెలపడమే కాకుండా ఉపాసన ఒడిలో రామ్ చరణ్ కూర్చుని ఉన్నటువంటి ఫోటోని ఈమె షేర్ చేశారు.

Ramcharan: చరణ్ ఎంతో లక్కీ…

ఇలా ఈ ఫోటో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారింది.ఈ ఫొటోస్ చూసినటువంటి మెగా అభిమానులు మరింత వైరల్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ ఫోటో ఇప్పటిది కాదని గతంలో ఎప్పుడో తీసుకున్నదని తెలుస్తుంది. ప్రస్తుతం ఉపాసన గర్భంతో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ ఫోటోని చూసినటువంటి మెగా అభిమానులు ఇంత మంచిగా చూసుకునే భార్య దొరికినందుకు చరణ్ ఎంతో అదృష్టవంతుడు అంటూ మెగా అభిమానులు ఈ జంట ను చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఉపాసన ప్రస్తుతం ఆరు నెలల గర్భిణీ అనే విషయం మనకు తెలిసిందే. ఇక మరికొద్ది నెలలో మెగా ఇంట బుల్లి వారసుడు అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో అభిమానులు బుల్లి రామ్ చరణ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on మార్చి 28, 2023 at 12:56 సా.