Ramcharan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కూతురితో అద్భుతమైన క్షణాలను గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల రామ్ చరణ్ – ఉపాసన దంపతులు పాప కి జన్మించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ పాప కి క్లింకార అని నామకరణం కూడా చేశాడు. ఈ మధురమైన క్షణాలలో భార్య బిడ్డతో కలిసి ఉండటానికి రామ్ చరణ్ కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇంటిపట్టునే ఉంటున్నాడు. మరొక మూడు నెలల పాటు రామ్ చరణ్ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తాజాగా రాంచరణ్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ గురించి రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వీడియోలో ఎన్టీఆర్, బన్నీ, మహేష్‌లో ఉన్న క్వాలిటీస్, తనకు ఉంటే బాగుండేదనిపించేవి ఏవి అని జయప్రద అడిగిన ప్రశ్నకు చరణ్ సమాధానం చెబుతూ.. `ఎన్టీఆర్‌లో చాలా ఎనర్జీ ఉంటుంది. అతనిలో ఉన్న ఎనర్జీ తనకు ఉంటే బాగుండేదనిపిస్తుందని సమాధానం ఇచ్చాడు.

Ramcharan: ఆ క్వాలిటీస్ నాలో ఉంటే బాగుండేది..
అలాగే అల్లు అర్జున్ లో స్పోర్టివ్ నెస్ ఉంటుందని, ఎవరేమన్నా సరదాగా తీసుకుని ముందుకెళ్తాడని చరణ్ చెప్పుకొచ్చాడు. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ఆయనలోని అందం తనకు కొంచెమైనా ఇస్తే బాగుండేదని చరణ్ సమాధానం తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం కొంతకాలం పాటు ఈ సినిమా షూటింగ్ కి చరణ్ బైక్ తీసుకున్నాడు.