Ramcharan -Upasana: సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకుని విడిపోవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా పెళ్లిళ్లు చేసుకొని ఎంతోమంది సెలబ్రిటీలు విడిపోయిన వారు ఉన్నారు..ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన సైతం ఒకానొక సమయంలో విడాకులు తీసుకొని విడిపోవాలని భావించారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దాదాపు పది సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో ప్రేమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్న రామ్ చరణ్ ఉపాసన తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
ఇలా పది సంవత్సరాలపాటు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి వీరిద్దరూ ప్రస్తుతం తల్లిదండ్రులుగా మారబోతున్నారు. ఇలా ఈ సంతోష సమయంలో రామ్ చరణ్ ఉపాసన గతంలో విడిపోవాలని విడాకుల వరకు వెళ్లారు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. అసలు రామ్ చరణ్ ఉపాసన ఎందుకు విడిపోవాలనుకున్నారు ఏంటి అనే విషయానికి వస్తే…ఉపాసన సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదు సినిమాల గురించి తనకు ఏ విధమైనటువంటి అవగాహన లేదు అందుకే పెళ్లి అయిన కొత్తలో రామ్ చరణ్ సినిమాలు చూసి కాస్త బాధపడేదట.ముఖ్యంగా రామ్ చరణ్ హీరోయిన్ లతో రొమాన్స్ చేస్తే ఉపాసన తట్టుకోలేక పోయిందని తెలుస్తుంది.
Ramcharan -Upasana: ఆ హీరోయిన్ కారణమా కారణమా….
ఇక రాంచరణ్ ఎక్కువగా కాజల్ అగర్వాల్ తో కాస్త రొమాంటిక్ గా నటించేవారట. ఈ విషయం ఉపాసనలు చాలా బాధపెట్టిందని అందుకే ఈ విషయం గురించి రాంచరణ్ ఉపాసన మధ్య గొడవ కూడా చోటుచేసుకుని విడాకుల వరకు వెళ్లారు. కానీ రామ్ చరణ్ పరిస్థితిని చిరంజీవి వివరించి చెప్పడంతో అర్థం చేసుకున్న ఉపాసన సినిమా వారి జీవితాలు ఇలాగే ఉంటాయా అని కాంప్రమైజ్ అవ్వడమే కాకుండా తాను చేసిన పొరపాటు కూడా తెలుసుకొని అప్పటినుంచి రాంచరణ్ తో చాలా మంచిగా సంతోషంగా గడుపుతున్నారు. దీంతో వీరి విడాకులు కూడా రద్దు అయ్యాయని తెలుస్తోంది. ఇలా రామ్ చరణ్ ఉపాసన విడాకుల వరకు వెళ్లి వచ్చారు అన్న వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది.