Ramesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ వారసులుగా ఇండస్ట్రీలోకి రమేష్ బాబు మహేష్ బాబు హీరోలుగా పరిచయమైన విషయం మనకు తెలిసిందే. కృష్ణ కొడుకులుగా వీరిద్దరూ బాల నటులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అనంతరం హీరోగా పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ప్రస్తుతం మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతూ ఉన్నారు. అయితే రమేష్ బాబు కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీలో కొనసాగిన అనంతరం ఈయనకు సినిమాలు పెద్దగా కలిసి రాకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇక రమేష్ బాబు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా పలు వ్యాపారాలు కూడా చూసుకుంటూ ఉండేవారు. అయితే రమేష్ బాబు ఉన్నఫలంగా గత ఏడాది మొదట్లో మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా రమేష్ బాబు మరణం తర్వాత వరుసగా మహేష్ బాబు ఫ్యామిలీలో మరణాలు చోటుచేసుకున్నాయి.రమేష్ బాబు మరణించి ఏడాది తర్వాత ఆయన మరణం గురించి తన బాబాయ్ ఆదిశేషగిరిరావు పలు విషయాలను వెల్లడించారు.
Ramesh Babu: గుండె సమస్యలతో బాధపడ్డారు…
కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా మే 31వ తేదీ తిరిగి విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఆదిశేషగిరిరావు రమేష్ బాబు మరణం గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు. రమేష్ బాబు మరణం కంటే ముందుగానే పలుమార్లు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడ్డారని ఆదిశేషగిరిరావు తెలియజేశారు. అయితే ఆయనకు డాక్టర్లు స్టంట్ వేసి సర్జరీలు కూడా చేశారని తెలియజేశారు. రమేష్ బాబు కార్డియాక్ అరెస్టు కారణంగానే మరణించారని ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.