Ramgopal Varma: వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలాంటి వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తారో ఎవరికి తెలియదు.ఈయన ఏదైనా సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేసిన లేదా మీడియా సమావేశంలో మాట్లాడిన పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు సృష్టిస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా రాజమౌళి గురించి రాంగోపాల్ వర్మ చేసినటువంటి ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి పేరు మారుమోగిపోతుంది. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ వంటి వారు రాజమౌళి సినిమా గురించి అందులో కొన్ని సన్నివేశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం.
ఇలా జేమ్స్ కామెరూన్ దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి పై ప్రశంసలు కురిపించడంతో కొందరు ఇండియన్ ఫిలిం డైరెక్టర్ రాజమౌళి పై పెద్ద ఎత్తున ఈర్ష పడుతూ ఉన్నారని ఇందులో భాగంగానే రాజమౌళిని చంపడానికి భారీగా కుట్ర పడుతున్నారు అంటూ రాంగోపాల్ వర్మ చేసినటువంటి ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.అయితే రాజమౌళిని చంపడానికి కుట్ర చేసిన వారిలో తాను కూడా ఉన్నానని కానీ నాలుగు పెగ్గులు ఎక్కువ పడేసరికి నిజాలు బయటికి వస్తున్నాయి అంటూ ఈయన చెప్పుకొచ్చారు.
Ramgopal Varma: మిమ్మల్ని చూసి ఎంతోమంది ఈర్ష్య పడుతున్నారు..
ఇక జేమ్స్, రాజమౌళి ఇద్దరూ మాట్లాడుతున్నటువంటి వీడియోని రాంగోపాల్ వర్మ షేర్ చేస్తూ…మొఘల్ ఈ ఆజాం తీసిన కా ఆసిఫ్ నుంచి.. షోలే తీసిన రమేష్ సిప్పీ వరకు అందరినీ నువ్ అధిగమించావ్.. ఆదిత్య చోప్రాలు, కరణ్ జోహర్‌లు, భన్సాలి వంటి వారిని దాటేశావు నాకు మీ బొటన వేలు చీకాలని ఉంది అంటూ వేడుకున్నారు.అయితే అనంతరం మరోక ట్విట్ చేస్తూ మీపై హత్యకు కుట్ర చేస్తున్నారు మీ భద్రతను పెంచుకోండి అంటూ ఈయన చేసినటువంటి ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే రాజమౌళి పై కుట్ర చేసే అంత ద్వేషం పగ ఎవరికి లేవని ఈ మాటలు కేవలం వర్మ మాటలు మాత్రమేననీ అర్థమవుతున్నప్పటికీ ఈయన చేసినటువంటి ఈ ట్వీట్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.