Ramgopal Varma: తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. ఇలా వివాదాల ద్వారా తరచూ వార్తల్లో ఉండే ఈయన పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు కూడా అదే స్థాయిలో వైరల్ అవుతుంటాయి అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ చిరంజీవి గురించి ట్విట్టర్ వేదికగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా హైపర్ ఆది భోళా శంకర్ సినిమాలో మాట్లాడిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు.
ఈ సినిమా వేడుకలో హైపర్ ఆది మాట్లాడుతూ…మెగా కుటుంబం పై తనకు ఉన్నటువంటి అభిమానాన్ని తెలియజేస్తూనే రాజకీయ చర్చలకు కారణమయ్యారు ఈ వేదికపై ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ తన జబర్దస్త్ కామెడీ డైలాగ్స్ వేశారు దీంతో వైసిపి అభిమానులు,వైఎస్ఆర్సిపి నేతలు హైపర్ ఆది పై అలాగే మెగాస్టార్ చిరంజీవి పై కూడా భారీ స్థాయిలో ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇలా ఈ విషయం కాస్త ప్రస్తుతం చర్చలకు కారణమైంది.
Ramgopal Varma: చిరు సినిమాలకే ప్రమాదం…
ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ ఈ విషయంపై స్పందిస్తూ .. జబర్ , హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి , రియాల్టీకి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోంది. పొగడ్తలతో ముంచే వాళ్ళ బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు వుండరు. రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు .. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే అంటూ ఈయన ట్వీట్ చేశారు. ఈ విధంగా రాంగోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఈయన చేసిన ట్వీట్ వాస్తవమేనని తెలిపారు. చిరంజీవి గారు ఈమధ్య ఇలాంటి పొగడ్తలకు పడిపోతున్నారని కానీ ఇది తన సినిమాలకే చాలా ప్రమాదకరంగా మారుతుంది ఈ విషయాన్ని మెగాస్టార్ గుర్తించాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.