Ramya krishna : సినిమా ఇండస్ట్రీ అంటే చాలామందికి సెలెబ్రెటీల హోదా మరియు స్టార్ డం మాత్రమే కనిపిస్తుంది. కానీ వారు గతంలో ఎదుర్కున్న కష్టాలు, అవమానాలు, కన్నీళ్ళు, ఇలాంటి వాటి గురించి ఎవరూ ఆలోచించరు. కానీ ఇవ్వాళ ఇండస్ట్రీలో సెలెబ్రెటీ హోదా అనుభవిస్తున్న చాలామంది గతంలో కష్టాల కడలని దాటినవాళ్ళే అని చాలామంది మర్చిపోతున్నారు. అయితే తెలుగులో విభిన్న చిత్రాలలో నటించి హీరోయిన్ గా మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే పలు నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు బ్యూటిఫుల్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి సినీ ఫ్యాక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే నటి రమ్యకృష్ణ ఒకప్పుడు హీరోయిన్ గా నటించి కుర్రకారుకి కునుకు లేకుండా చేసింది.
ఈ మధ్యకాలంలో ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రంలో ఒకపక్క తన పాత్రకి తగ్గట్టుగా రాజసం పలికిస్తూనే మరోపక్క నెగిటివ్ షేడ్స్ కూడా పలికిస్తూ తన అద్భుతమైన నటనా తీరుతో తన పాత్రకి వందకి 100% న్యాయం చేసింది. దీంతో బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ నటించిన శివగామి పాత్ర తన సినీ కెరియర్ లోనే మైలురాయిగా నిలిచిపోయింది.
అయితే నటి రమ్యకృష్ణ దాదాపుగా 100కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించడంతోపాటు ప్రస్తుతం వయసు మీద పడటంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో కూడా నటిస్తూ ఇప్పటికీ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. అయితే ప్రస్తుతం నటి రమ్యకృష్ణ అనుభవిస్తున్న ఈ స్టార్ సెలబ్రిటీ హోదా అంత సులువుగా ఏమీ దక్కలేదు. ఒకప్పుడు నటి రమ్యకృష్ణ అందానికి కేరాఫ్ అడ్రస్ గా నిలవడంతో చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ క్రమంలో కొందరు దర్శకులు నటి రమ్యకృష్ణతో అసభ్యకరంగా ప్రవర్తించిన సందర్భాలు కూడా లేకపోలేదు.
ఈ క్రమంలో నటి రమ్యకృష్ణ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ఓ డైరెక్టర్ వద్దకు వెళితే అతడు ఏకంగా అసభ్యకర వీడియోలు చూపిస్తూ ఇలాంటి వాటిలో నటించడానికి మాత్రమే నువ్వు పనికొస్తావని నువ్వు హీరోయిన్ గా నటించడానికి ఏమాత్రం పనికిరాని అసభ్యకర మాటలతో దారుణంగా అవమానించాడట. దాంతో రమ్యకృష్ణ ఈ మాటలను ఛాలెంజింగ్ గా తీసుకొని తిరుగులేని స్టార్ హీరోయిన్ గా దాదాపుగా పది సంవత్సరాలపాటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని ఏలింది. చివరికి తనని హీరోయిన్ గా పనికిరావని అవమానించిన దర్శకుడే తన వద్దకు వచ్చి డేట్లు ఇమ్మని అడిగే రేంజ్ కి వెళ్ళిపోయింది.
అయితే ఎప్పుడో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో వెలుగులోకి రావడంతో కొందరిని నెటిజన్లు ఈ విషయంపై భిన్నంగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సక్సెస్ అంటే ఇదే అని అలాగే ఎవరైనా మనల్ని అవమానించినా లేదా తప్పుగా మాట్లాడినా సరే కొన్ని క్షణాలు ఓర్చుకొని ఆ మాటలను చాలెంజిగా తీసుకుంటే కచ్చితంగా లైఫ్ లో సక్సెస్ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మరికొందరైతే సక్సెస్ కి నిదర్శనం రమ్యకృష్ణ అని అలాగే వివేకంతో ఆలోచించే వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతరుల మాటలను పెద్దగా పట్టించుకోరని అందుకే గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారని అందుకు ఉదాహరణ రమ్యకృష్ణ అని పొగుడుతున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి రమ్యకృష్ణ తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న లైగర్ అనే చిత్రంలో హీరో తల్లి పాత్రలో నటిస్తోంది. లైగర్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాక మంచి ప్రేక్షకు ఆదరణ లభించింది.