Ramya Krishna: సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే వారిలో కొంతమందికి మాత్రమే సినిమాలలో నటించే అవకాశాలు వస్తాయి. అయితే అవకాశాలు వచ్చినా కూడా కొన్ని సందర్భాలలో సర్దుకుపోయి కాంప్రమైజ్ అయితేనే ఇండస్ట్రీలో గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్లు, మహిళ క్యారెక్టర్ ఆర్టిస్టులు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. సినిమాలలో నటించే అవకాశాలు అందుకోవటానికి చిన్న చిన్న సమస్యలతో పాటు క్యాస్టింగ్ కౌచ్ అనే అతిపెద్ద సమస్యను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఇది సర్వసాధారణం. ఇప్పటికే ఎంతోమంది నటీమణులు మీడియా ముందుకి వచ్చి కాస్టింగ్ కౌచ్ వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బయటపెట్టారు.
తాజాగా ఈ విషయంపై స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు రమ్యకృష్ణ సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఇక ప్రస్తుతం సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందించిన రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో రమ్యకృష్ణ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా అన్ని ఇండస్ట్రీలలో కూడా ఈ సమస్య ఉందని తెలిపింది. అయితే సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు అవకాశాలు అందుకోవాలంటే కొన్ని విషయాలలో సర్దుకుపోవాలని తెలిపింది.

Krishna: రమ్యకృష్ణను కూడా ఇబ్బంది పెట్టారా…
అంతేకాకుండా అవకాశాలు వచ్చిన తర్వాత వాటిని సద్వినియోగం చేసుకొని స్టార్ గా గుర్తింపు పొందాలంటే గదిలోకి వెళ్లక తప్పదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రమ్యకృష్ణ క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయంగా మారింది. స్టార్ హీరోయినే ఇలా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతుంటే ఇక చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్టులు పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న తలెత్తింది. అయితే ఇండస్ట్రీలో జరుగుతున్న దాని గురించి రమ్యకృష్ణ వెల్లడించిందా? లేక తన జీవితంలో కూడా క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బందులు ఎదురుకుందా ? అనే విషయాలు తెలియాల్సి ఉంది.