Ramya Raghupathi: సినీ నటుడు నరేష్ రమ్యా రఘుపతి వ్యవహారం రోజురోజుకు వివాదంగా మారుతుంది. రమ్యా రఘుపతి నరేష్ కు మూడో భార్య అయితే ఈమె ఆయన నుంచి దూరంగా ఉంటున్నారు. ఇక రమ్యా రఘుపతి దూరం కావడంతో తనకు విడాకులు ఇచ్చి నరేష్ నటి పవిత్ర లోకేష్ ను నాలుగో పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఈయన అధికారకంగా కూడా తెలియజేశారు.అయితే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి ఇంటర్వ్యూలకు హాజరవుతూ నరేష్ వ్యక్తిత్వం గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టారు.
ఇక నరేష్ తనకు విడాకులు ఇచ్చి రమ్య రఘుపతిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారు. కానీ నేను మాత్రం నరేష్ కు విడాకులు ఇవ్వనని ఈమె తేల్చి చెప్పారు.నేను తనని ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను నా కుమారుడు కూడా నాన్న నుంచి విడిపోవద్దని నన్ను కోరాడు నా కొడుకుకు తండ్రి కావాలి అందుకే నేను నరేష్ కు విడాకులు ఇవ్వనని తెలిపారు. ఆయన నాకు విడాకులు ఇవ్వడం కోసం మూడు కోట్ల నుంచి 20 కోట్ల వరకు భరణం ఆఫర్ చేశారని రమ్య తెలిపారు.
Ramya Raghupathi: ఆయన ఆస్తి డబ్బులు నాకు అవసరం లేదు…
ఇక ప్రతి నెల తన కొడుకు మెయింటెనెన్స్ కోసం నరేష్ తనకు డబ్బు పంపిస్తున్నారని అయితే అది కూడా మూడు సంవత్సరాల నుంచి 50 వేల రూపాయలు పంపించగా ప్రస్తుతం 70000 పంపిస్తున్నారని రమ్య తెలిపారు. అయితే నరేష్ నుంచి నాకు ఆయన ఆస్తి తన డబ్బు ఏ మాత్రం అవసరం లేదని కేవలం ఆయన నన్ను భార్యగా స్వీకరించి తనకు భార్యగా ఉండాలని కోరుకుంటున్నానని ఈమె తెలియజేశారు.నా కుమారుడికి తండ్రి కావాలి నేను ఆయనకు భార్యగా ఉండాలి కానీ తన ఆస్తులు డబ్బు నాకు అవసరం లేదని అందుకే నేను నరేష్ కు విడాకులు ఇవ్వనని రమ్య రఘుపతి క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.