Ramya Raghupathi: నరేష్ పవిత్ర లోకేష్ జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మళ్ళీ పెళ్లి. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మే 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా నరేష్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిందని ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో నరేష్ మూడో భార్య పాత్రలో నటి వనిత విజయ్ కుమార్ కూడా నటించారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమా మరి కొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి ఊహించని విధంగా ఈ సినిమా విడుదల ఆపివేయాలి అంటూ కోర్టును ఆశ్రయించి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ సినిమాని విడుదల చేయకూడదు అంటూ ఈమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా చేశారని అందుకే ఈ సినిమాని నిలిపివేయాలి అంటూ ఈమె కోర్టును ఆశ్రయించారు.
Ramya Raghupathi: పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది…
రమ్య రఘుపతి మళ్లీ పెళ్లి సినిమా విషయంలో జోక్యం చేసుకుంటూ సినిమా విడుదలకు అడ్డుపడటంతో ఒక్కసారిగా చిత్ర బృందం షాక్ అయ్యారు.మరి రమ్య రఘుపతి ఫిర్యాదుతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయం తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాని నరేష్ స్వయంగా విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు.ఎన్నో అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమాకు రమ్య రఘుపతి అడ్డుపడటం సంచలనంగా మారింది.