Ramyakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రమ్యకృష్ణ తెలుగు, తమిళ్ భాషలలోఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి కీలక పాత్రలలో బిజీగా ఉంది. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాలో శివగామి వంటి పవర్ ఫుల్ పాత్రలో నటించిన తర్వాత రమ్యకృష్ణకు ప్రస్తుతం అన్ని అలాంటి పాత్రలే వస్తున్నాయి.
ఇక తాజాగా కృష్ణవంశీ దర్శకత్వం వహించిన రంగమార్తాండ సినిమాలో కూడా కీలకపాత్రలో నటించి మరొకసారి తన నటనతో ప్రేక్షకులను మాయ చేసింది.
తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్యకృష్ణ రంగమార్తాండ సినిమా విశేషాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అంతేకాకుండా సినిమా దర్శకుడు తన భర్త అయినా కృష్ణవంశీ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం రమ్యకృష్ణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో చాలా కాలం తర్వాత రమ్యకృష్ణ నటించింది. మొదట కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన చంద్రలేఖ సినిమాలో రమ్యకృష్ణ నటించిన ఆ సినిమా షూటింగ్ సమయంలోనే అతనితో ప్రేమలో పడి వివాహం చేసుకుంది.
Ramyakrishna: డైరెక్టర్ గానే ఇష్టపడతాను..
ఇక ఇటీవల విడుదలైన రంగమార్తాండ సినిమాలో నటించింది. ఈ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ గురించి మాట్లాడుతూ అతనిపై ప్రశంసలు కురిపించింది. కృష్ణవంశీ డైరెక్షన్‌లో పనిచేయడం అద్భుతమైన ఎక్స్ పీరియెన్స్ అని, ఒక నటిగా ఆయన దర్శకత్వంలో పనిచేయడం ఇష్టమని తెలిపింది ఇప్పటి వరకు తాను పనిచేసిన దర్శకులతో పోల్చితే వంశీతో వర్క్ చేయడం బెస్ట్ ఎక్స్ పీరియెన్స్ అని ప్రశంసించింది. ఇక ఈ మేరకు దర్శకుడిగా, భర్తగా ఇద్దరిలో ఎవరంటే మీకు బాగా ఇష్టం అని ప్రశ్నించగా.. ఆయన డైరెక్షన్ గురించి ప్రశంసిస్తూ, భర్తగా కంటే తనకు డైరెక్టర్‌గానే ఇష్టమని చెప్పింది. ఆయనకు భార్యగా కంటే ఆయన దర్శకత్వంలో పనిచేయడానికే ఎక్కువ ఇష్టపడతానని తెలిపింది. కృష్ణవంశీ గురించి రమ్యకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.