Rana and Miheeka: రానా దగ్గుబాటి.. ఈ పేరు టాలీవుడ్ ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేదు. రామానాయుడు మనవడు గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రానా తొలి సినిమా లీడర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకున్నాడు. ఆపై పలు సినిమాల్లో నటించిన రానా తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకున్నాడు.
ఇక హీరో రోల్స్ లో అంతగా ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయినా రానా.. నెగిటివ్ రోల్స్ కి శ్రీకారం చుట్టి తెలుగు ప్రేక్షకులను ఒక్కసారిగా స్టన్ అయ్యేలా చేసాడు. బాహుబలి, బాహుబలి 2, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాల్లో రానా చేసిన నెగిటివ్ రోల్స్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమాలో రానా విలన్ గా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.
ఇక రానా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడు. ఇక పోతే రానా భార్య మీహీక బజాజ్ మనందరికీ తెలుసు. ప్రస్తుతం ఈ జంట తమ వివాహబంధాన్ని ఒక రేంజ్ లో చిల్ అవుతున్నారు. రానా భార్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఆమె ఎప్పటికప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటుంది.

Rana and Miheeka: రానా భార్య ప్రెగ్నెంట్ కాదు అని చెప్పడానికి కారణం ఇదే!
ఇక అదే క్రమంలో మీహీక తన ఫ్రెండ్ వెడ్డింగ్ లో ఆమె తన భర్తతో పాటు పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ వెడ్డింగ్ లో ఇద్దరు దంపతులు తెగ హడావిడి చేశారు. ఇక ఆమె పంచుకున్న ఆ ఫోటోలలో ఆమె కొంచెం బొద్దుగా కనిపిస్తుంది. దాంతో కొందరు నెటిజన్లు ప్రెగ్నెంట్ అంటూ వార్తలు ప్రచారం చేస్తున్నారు.
ఇక అదే క్రమంలో ఒక నెటిజన్ మీరు ప్రెగ్నెంటా అని అడిగాడు ఆ ప్రశ్నకి ఆమె నో నో మ్యారేజ్ వెయిట్ అంటూ..రిప్లై ఇచ్చింది. దీంతో రానా భార్య ప్రెగ్నెంట్ కాదు అన్న విషయం తేలిపోయింది.