Rana: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నాగ చైతన్య, సమంత గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వారి వ్యక్తిగత విషయం మాత్రం అందరికీ తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా నిలిచారు. ఇక ఇద్దరు తమ తమ జీవితాల్లో బాగా బిజీగా మారారు. వరుస సినిమాలతో అవకాశాలు అందుకుంటున్నారు.
అలా నాగ చైతన్య ప్రస్తుతం డైరెక్టర్ కే కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమాకు థాంక్యూ అని టైటిల్ కూడా ప్రకటించారు. ఇక ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదల చేయగా.. అందులో ఉన్న కంటెంట్ గురించి మాట్లాడటం కంటే ఆ సినిమా డైలాగ్ గురించే మాట్లాడుకుంటున్నారు ప్రేక్షకులు. ఆ టీజర్ లో నన్ను నేను సరి చేసుకోవడానికి నేను చేసిన ప్రయత్నమే థాంక్యూ అంటూ నాగచైతన్య డైలాగ్ చెప్పుకొచ్చాడు.
దీంతో ఈ డైలాగ్ అందరూ సమంతను ఉద్దేశించి ఈ డైలాగ్ కొట్టాడు అని అనుకుంటున్నారు. దీంతో ఈ విషయం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఈ సినిమా టీజర్ ను చూసిన సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా టీజర్ గురించి స్పందించారు. రకరకాల కామెంట్లు కూడా చేశారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరో రానా కూడా ఈ టీజర్ చూసి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసాడు.

Rana: సమంతను ఉద్దేశించి రానా ఇలా కామెంట్ చేశాడు..
తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. నువ్వు ఆల్రెడీ సరి అయిపోయావు బ్రదర్.. సూపర్ టీజర్ గాయ్ అని ట్వీట్ చేశాడు. ఇక ఈయన చేసిన సమంత విషయంలో నాగచైతన్యపై ఇండైరెక్ట్ గా కామెంట్ చేశాడా అని కొందరు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ సినిమా డైలాగును కావాలనే సమంత ను ఉద్దేశించి పెట్టారు అని అంటున్నారు.